నెల్లూరు నగరంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. వైసీపీ నేతల మద్దతుతో తమపై పోలీసుల వేధింపులు ఎక్కువైపోయాయి అని మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు ఆరోపించారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. పోలీసులు గత వారం రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నారని దీనికి నిరసనగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు టీడీపీ నేతలు తెలిపారు. దీంతో కత్తి శ్రీనివాసులును హుటాహుటిన నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వైద్యం అందించే ప్రయత్నం చేశారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అపోలో హాస్పిటల్ కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.