దేశంలో ఐదురాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి19న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది బీజేపీ. గతంలోలాగే అన్నాడీఎంకే తమ మిత్రపక్షమే అనీ, తమ బంధం అలాగే ఉంటుందని తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం సీట్లు ఇచ్చేందుకు ఏఐఏడీఎంకే నాయకత్వం ముందుకు వచ్చిందని, అయితే..తమకు ఎక్కువ…
నెల్లూరు నగరంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. వైసీపీ నేతల మద్దతుతో తమపై పోలీసుల వేధింపులు ఎక్కువైపోయాయి అని మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు ఆరోపించారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. పోలీసులు గత వారం రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నారని దీనికి నిరసనగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు టీడీపీ నేతలు తెలిపారు. దీంతో కత్తి శ్రీనివాసులును హుటాహుటిన నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వైద్యం అందించే ప్రయత్నం చేశారు. మెరుగైన…