Police Arrested 5 People In Fake Documents Case In Vijayawada: నకిలీ డాక్యుమెంట్స్‌తో అక్రమాలకు పాల్పడిన ఒక ముఠాని విజయవాడలో అరెస్ట్ చేశారు. గాంధీ నగర్ సబ్ రిజిస్టర్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్స్‌తో ఆ ముఠా రావడాన్ని గుర్తించిన పోలీసులు.. వెంటనే అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురిని గవర్నర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై సీఆర్ నం.1/2023 యూ/ఎస్ 419, 420, 465, 467, 468 & 120(బీ) ఐపీసీగా కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివరాలను డీసీపీ విశాల్ గున్ని మాట్లాడుతూ.. ఈ ముఠాలో మొత్తం ఐదుగురు ఉన్నారని, విశాఖ నుండి నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా భూములను అమ్మకాలు చేసి అవినీతికి పాల్పడ్డారన్నారు. ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసి, లింక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారన్నారు. ఆ తర్వాత ఆస్తిని అమ్మకానికి పెడతారని వివరించారు. విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మొత్తం 19 ప్రాంతాల్లో ఈ ముఠా నకిలీ డాక్యుమెంట్స్‌తో భూములను అమ్మి, సొమ్ము చేసుకున్నారని తెలిపారు.
DGCA: ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు.. ఎందుకంటే?
కాగా.. 1980-1988 మధ్య కాలంలో గాంధీనగర్‌లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కొంతమంది ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చి రిక్రియేషన్ చేయించుకోగా, మరికొంతమంది చేయించుకోలేదు. ఇలాంటి డాక్యుమెంట్ల నంబర్లు తెలుసుకొని, నకిలీ ముఠా ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించింది. ఒకవేళ అసలు యజమాని వచ్చి, ఆ స్థలం తనదేనని వారించినా.. తమదే అసలైన రికార్డని కోర్టుకెక్కుతున్నారు. ఇలా వివాదం సృష్టించి, కోట్లు పోగేయడమే ఈ నకిలీ ముఠా ప్రణాళిక. గాంధీనగర్ సబ్ రిజిస్ట్రర్‌లో ప్రారంభమైన ఈ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం.. ఆ తర్వాత ఇతర కార్యాలయాల్లోనూ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో.. శాక పరంగా విచారణ చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ఒక స్థలాన్ని.. గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ చేయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి ఇది విచారణ జరుగుతోంది.
Viral Letter: భార్యను బుజ్జగించుకోవాలి.. లీవ్ ఇవ్వండి.. ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్