Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Polavaram Project Completion 2027 Modi Launch

Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

Published Date :May 11, 2026 , 6:52 pm
By Gogikar Sai Krishna
  • ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం
  • కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం బృందం భేటీ
  • మీడియా తో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఆంధ్రప్రదేశ్ ని కరువు రహిత రాష్ట్రంగా మార్చే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అదే నెలలో గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం సోమవారం ఆయన కార్యాలయం లో కలసి గంటపాటు చర్చలు జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీలో మీడియాకు వివరించారు. పోలవరం సత్వర పూర్తి కి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని జలశక్తి మంత్రి పాటిల్ సీఎం బృందానికి హామీ ఇచ్చారని రామానాయుడు చెప్పారు. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైపోయిందని అన్నారు. ఎప్పటికి అవుతుందో చెప్పలేమని చేతులెత్తేసిన దుస్థితి నుంచి పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తి చేస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రి జల శక్తి మంత్రికి వివరించి సహకారాన్ని కోరారని మంత్రి నిమ్మల చెప్పారు. మైనర్ ఇరిగేషన్ రంగానికి సంబంధించి ప్రతిపాదనల తాలూకు నిధులు కూడా ఇవ్వాలని కోరామని తెలిపారు. కాలువల ద్వారా కాకుండా పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి ఎంపికైన విజయనగరం జిల్లాలో పనులు ముందుకు తీసుకు వెళుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారని నిమ్మల వివరించారు. నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా భారతదేశాన్ని సస్యశ్యామలం చేయాలనే నాటి ప్రధాని వాజ్పేయి నుంచి నేటి ప్రధాని మోదీ వరకు చేస్తున్న కృషిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకుని అవిరళ కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే పోలవరం- నల్లమల సాగర్ ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు. అలాగే గోదావరి-కావేరి అనుసంధానానికి కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నట్లు చెప్పారు.

Also Read

  • Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
  • Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
  • Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!
  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
Add as a preferred
source on google

రాష్ట్రంలోని సంప్రదాయ నీటి వనరులైన నదులు, జలాశయాలు, కాలువలు,చెరువులు సద్వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్ధ కృషి చేస్తుందని అన్నారు. అలాగే భూగర్భన్ని కూడా జలాశయంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృహత్తర ప్రతిపాదనకు కేంద్ర మద్దతు ఉందని మంత్రి నిమ్మల చెప్పారు. అలాగే సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం 19వ గేట్ దెబ్బతిన్నప్పుడు దాన్ని తక్షణం మార్చి పెను ప్రమాదాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నివారించగలిగిందన్నారు. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ కు 33 కొత్త గేట్లు మారుస్తున్నట్లు చెప్పారాయన.

పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్ ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వివరించారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల పునరావాసం, పరిహారాలకు సంబంధించి నిధులను సకాలంలో సమకూరుస్తామని కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు రెండో దశలో కీలకమైన భూసేకరణ, పునరావాసం కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరమన్నారు. ప్రతి ఏడాది గోదావరిలోని 3000 టీఎంసీలు నీరు బంగాళాఖాతంలో కలిసిపోతున్నందున ఈ వృధా జలాలను వినియోగించుకునే విధంగా ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని, గోదావరి వృధా జలాల వినియోగించుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాలు లబ్ధి పొందాలనేదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశం అన్నారు. చిన్నపాటి సమస్యలు ఏమైనా తెలంగాణతో ఉంటే సానుకూల వాతావరణంలో చర్చల ద్వారా సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ వంటి వాటికి కర్ణాటక ముందుకు వెళ్లకుండా సహకరించాలని కోరామని చెప్పారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh News
  • AP Irrigation
  • Chandrababu Naidu
  • cr patil
  • Narendra Modi

తాజావార్తలు

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

  • Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్‌లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!

  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?

  • Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్‌గా ఇలా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions