Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్‌లు..! ప్రత్యేక మెకానిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media Monitoring: సోషల్ మీడియా అంశంపై ఏపీ కేబినెట్ ఎజెండా తర్వాత సీరియస్ గా చర్చ జరిగింది.. సోషల్ మీడియాకు సంబంధించి ఒక ప్రత్యేక మెకానిజం రావాలన్నారు సీఎం చంద్రబాబు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్చ జరిగింది… సోషల్ మీడియాకు సంబంధించి.. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా… అవసరం అయితే కేంద్రాన్ని కూడా. సంప్రదించి నిర్ణయం. తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను మాత్రం ఉపేక్షించవద్దని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సోషల్ మీడియా అంశంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ఇందుకోసం అవసరమైతే బయటనుంచి సిబ్బందిని తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశాలు అందాయి.. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అవసరమైతే కొత్తగా పీపీలను నియించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలు, అసలు విషయాలు వక్రీకరిస్తే మాత్రం ఉపేక్షించవద్దని గట్టిగా కోరారు మంత్రులు. ఈ రోజు నుంచే పోలీస్ యంత్రాంగం సోషల్ మీడియాపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని ఆదేశాలు ఇచ్చారు.
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు.. వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పై నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త పద్ధతి ఎన్నుకున్నారని మంత్రులకు చెప్పారు సీఎం చంద్రబాబు… వారు కావాలని మన MLAలను రెచ్చగొడుతున్నారన్న సీఎం చంద్రబాబు…. వైసీపీ వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని మంత్రులకు సూచించారు… మనలను ట్రాప్ లోకి లాగుతున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు.. అనంతపురం, మిగతా జిల్లాలలో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు సీఎం.. అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు.. ఇంఛార్జ్ మంత్రులు జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.. ఇంఛార్జ్ మంత్రులు రెవెన్యూ, ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాలన్నారు.. ఆయా జిల్లాలో ప్రతి అంశంపై ఇంఛార్జ్ మంత్రులు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?