Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
- వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్
- ఈ SUV ధర రూ.41.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- 9 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS వంటి అధునాతన భద్రతా వ్యవస్థలను అందించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వోక్స్వ్యాగన్ ఇండియా కొత్త ప్రీమియం 5-సీటర్ SUV Volkswagen Tayron Lifeను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఆధునిక డిజైన్, అత్యాధునిక భద్రతా ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ SUV ధర రూ.41.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ప్రీమియం SUV కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ మోడల్లో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS వంటి అధునాతన భద్రతా వ్యవస్థలను అందించారు.
భారీ సైజు.. విశాలమైన బూట్ స్పేస్
Volkswagen Tayron Life పొడవు 4,792 మిమీ, వీల్‌బేస్ 2,789 మిమీగా ఉంది. ఈ SUVలో 885 లీటర్ల బూట్ స్పేస్ ఉండగా, వెనుక సీట్లను మడిచిన తర్వాత దీన్ని 2,090 లీటర్ల వరకు విస్తరించవచ్చు. దీని వల్ల కుటుంబ ప్రయాణాలు, లాంగ్ ట్రిప్స్‌కు ఇది అనువైన ఎంపికగా నిలుస్తుంది.
Also Read
- Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
- Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
- Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
- క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్లోకి Hyundai Creta 7-Seater.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
ఆకర్షణీయమైన ఎక్స్టీరియర్ డిజైన్
కొత్త Tayron Lifeలో పూర్తి LED హెడ్‌ల్యాంప్స్, ముందు భాగంలో ఇల్యూమినేటెడ్ Volkswagen లోగో, నిరంతర LED లైట్ సిగ్నేచర్, బాడీ కలర్ బంపర్, సిల్వర్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, బ్లాక్ రూఫ్ రైల్స్ వంటి ప్రీమియం డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే 18-అంగుళాల అలాయ్ వీల్స్, డోర్ హ్యాండిల్ ట్రాప్ లైటింగ్, మిర్రర్ ప్రొజెక్షన్ లైటింగ్ వంటి ఫీచర్లు ఈ SUVకు మరింత ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తున్నాయి.
క్యాబిన్లో ఆధునిక టెక్నాలజీ
Volkswagen Tayron Lifeలో 10.25-అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, లెదర్ ర్యాప్డ్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, రియర్ వ్యూ కెమెరా, హై-బీమ్ అసిస్ట్, పవర్ అడ్జస్టబుల్, హీటెడ్, ఫోల్డింగ్ ORVMలు, Apple CarPlay, Android Auto (వైర్డ్ & వైర్లెస్), రెండు మొబైల్ ఫోన్లకు వైర్లెస్ ఛార్జింగ్, ముందు, వెనుక USB పోర్టులు.
భద్రతలో అత్యున్నత స్థాయి
భద్రత పరంగా Tayron Lifeలో మొత్తం 9 ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. వీటిలో డ్రైవర్, ప్రయాణికుడు, సైడ్, కర్టెన్, రియర్ సైడ్, సెంటర్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అదనంగా, Level-2 ADAS (14 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు), Electronic Stability Control (ESC), TPMS, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ముందు, వెనుక డిస్క్ బ్రేకులు
ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, ఆటో-డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఆధునిక భద్రతా సదుపాయాలను కూడా అందించారు.
శక్తివంతమైన 2.0L TSI పెట్రోల్ ఇంజిన్
Volkswagen Tayron Lifeలో 2.0-లీటర్ TSI EVO టర్బో పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 204 PS పవర్, 320 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో పాటు 4MOTION ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వ్యవస్థను జత చేశారు. దీంతో నగర రోడ్లతో పాటు క్లిష్టమైన రహదారులపైనా మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ధర, రంగులు
Volkswagen Tayron Life ప్రారంభ ధర రూ.41.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ SUV ఈ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.. డాల్ఫిన్ గ్రే మెటాలిక్, సిప్రెస్సినో గ్రీన్ మెటాలిక్, ఓయిస్టర్ సిల్వర్ మెటాలిక్, నైట్‌షేడ్ బ్లూ మెటాలిక్, అల్ట్రావయోలెట్ మెటాలిక్, ఓరిక్స్ వైట్ మదర్-ఆఫ్-పెర్ల్ ఎఫెక్ట్, గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్. ప్రీమియం డిజైన్, ఆధునిక టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరు, అత్యున్నత భద్రతా ఫీచర్లతో Volkswagen Tayron Life భారత ప్రీమియం SUV విభాగంలో గట్టి పోటీని ఇవ్వనుంది.
తాజావార్తలు
-
Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?