Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saif Ali Khan: కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఓ నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్లో అత్యంత ప్రశంసలు అందుకున్న ‘ఓంకార’ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు విశాల్ భరద్వాజ్ సూచించిన ఒక సన్నివేశాన్ని తాను చేయకపోవడం ఇప్పటికీ బాధ కలిగిస్తోందని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో 2006లో విడుదలైన ‘ఓంకార’ హిందీ చిత్రసీమలో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విలియం షేక్స్పియర్ రాసిన ‘ఒథెల్లో’ నాటకానికి భారతీయ నేపథ్యాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ పోషించిన ‘లంగ్డా త్యాగి’ పాత్ర ఆయన కెరీర్లోనే అరుదైన పాత్రల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన అప్పటి షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, సినిమాలో అద్దం ముందు నిలబడి ఉండే ఒక కీలక సన్నివేశాన్ని దర్శకుడు విశాల్ భరద్వాజ్ పూర్తిగా భిన్నంగా చిత్రీకరించాలని భావించారని చెప్పారు. ఆ సమయంలో బట్టలు లేకుండా ఆ సన్నివేశాన్ని చేయాలని దర్శకుడు తనను అడిగారని వెల్లడించారు. ఆ ఆలోచన తనకు ఆసక్తికరంగానే అనిపించినప్పటికీ, సెట్లో చాలా మంది ఉండటంతో కొంత సంకోచం కలిగిందని చెప్పారు. దర్శకుడు బలవంతం చేస్తే తప్పకుండా చేసేవాడినని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే విశాల్ భరద్వాజ్ ఆ నిర్ణయాన్ని తనపై రుద్దలేదని, అక్కడితో ఆ చర్చ ముగిసిపోయిందని వివరించారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సన్నివేశాన్ని అంగీకరించి ఉండాల్సిందని భావిస్తున్నట్లు సైఫ్ చెప్పారు. ఆ సన్నివేశాన్ని వెనుక నుంచి నీడ రూపంలో చిత్రీకరించి ఉంటే మరింత ప్రభావవంతంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అలాంటి కథకు అవసరమైన సన్నివేశం వస్తే నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని కూడా వెల్లడించారు. ఒక నటుడిగా పాత్రకు అవసరమైతే సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
ఇంటర్వ్యూలో మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా సైఫ్ గుర్తు చేసుకున్నారు. ‘లంగ్డా త్యాగి’ పాత్రను మొదట తనకు కాకుండా బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ఆఫర్ చేసినట్లు చెప్పారు. ఆ పాత్ర గురించి ఆమిర్ అనేక ప్రశ్నలు అడిగారని, కొన్ని మార్పులు కూడా సూచించారని విశాల్ భరద్వాజ్ తర్వాత తనతో చెప్పినట్లు వెల్లడించారు. అయితే దర్శకుడు తన అసలు కథనాన్ని మార్చాలనుకోకపోవడంతో చివరకు ఆ పాత్ర తన వద్దకు వచ్చిందని సైఫ్ వివరించారు. ‘ఓంకార’లో లంగ్డా త్యాగిగా సైఫ్ అలీ ఖాన్ చూపించిన నటనకు అప్పట్లో విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా లభించాయి. విడుదలైన రెండు దశాబ్దాల తర్వాత కూడా ఆ పాత్ర గురించి ప్రేక్షకులు మాట్లాడుతుండటం, ఇప్పుడు సైఫ్ పంచుకున్న ఈ జ్ఞాపకాలు మరోసారి ఆ సినిమాని వార్తల్లో నిలబెట్టాయి.
- Tags
- cinema
- Saif Ali Khan
తాజావార్తలు
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!