Peddireddy Ramachandra Reddy: కక్షపూరితంగానే ఆ పని చేశారంటూ.. చంద్రబాబుపై మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కక్షపూరితంగా చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లి.. ప్రాజెక్ట్ నిర్మాణాలపై స్టే తెచ్చారని వ్యాఖ్యానించారు. పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో తాగు సాగు నీటిని అందించాలని మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామని.. ఇప్పటికే రెండు రిజర్వాయర్ల నిర్మాణ పనుల్ని దాదాపు పూర్తి చేశామని తెలియజేశారు. ఆ నిర్మాణాలు పూర్తయితే.. రైతులకు, ప్రతి ఇంటికి నీరు అందుతుందని అన్నారు. కానీ.. ఇంతలోనే చంద్రబాబు ఆ నిర్మాణాల్ని ఆపేందుకు సుప్రీంకోర్టుకి వెళ్లి, స్టే తీసుకొచ్చారని మండిపడ్డారు. గతంలో రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇస్తే, దానిని ఒకటిన్నర సంవత్సరం పాటు కోర్టులో అడ్డుకున్నారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని.. చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినా.. ప్రతిపక్షాలు అభివృద్ధి లేదని విమర్శలు చేస్తున్నాయని, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి జరుగుతున్న వారికి అది కనపడదని ఎద్దేవా చేశారు.
Bhatti Vikramarka: జడ్చర్ల నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర.. ఉద్దండపూర్ ప్రాజెక్టు పరిశీలన
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
అంతకుముందు.. టీడీపీ , జనసేన పార్టీలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా.. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 150 స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీ భయపడదని.. రాజకీయంగా తాము టీడీపీలాగా ఊతకర్ర పట్టుకుని నడిచే పరిస్ధితుల్లో లేమని చురకలంటించారు. పవన్ కల్యాణ్ పోటీ చేసే ముందు.. ఆయన గెలుస్తారో లేదో ఆలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబును సీఎంను చేసేందుకే పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు.
Road Accident: లోయలో పడిన వాహనం.. ఆరుగురు దుర్మరణం, పలువురికి గాయాలు
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!