Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 69వ రోజుకు చేరింది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గంలో పాద యాత్ర కొనసాగనుంది. ఇవాళ భట్టి విక్రమార్కను ఉద్దండపూర్ నిర్వాసితులు కలువనున్నారు. ఉద్దండపూర్ ప్రాజెక్టు పరిశీలించనున్నారు. మైసమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన నిర్వాసితుల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొంటారు. ఉద్దండపూర్, వల్లూర్, బండ మీది పల్లి గ్రామాల వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఉద్దండపూర్- వల్లూరు గ్రామాల మధ్యన మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. రాత్రికి బండమీదిపల్లి గ్రామంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం బస చేయనుంది.
Read also: Nithesh Pandey: కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ సాధన లక్ష్యాలు నిజంగా నెరవేరితే ప్రజలు హృదయపూర్వకంగా భక్తిశ్రద్ధలతో పండుగలు జరుపుకునేవారన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం నవాబుపేట మండలం రుక్కంపల్లి బేస్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మల్లారెడ్డిపల్లి శివారులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్ది వేడుకలకు ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. డబ్బులు ఇచ్చి పండుగలు చేసుకునే పరిస్థితి లేదని, ఈ వేడుకలు తెలంగాణ పాలకుల కోసమేనని విమర్శించారు. తెలంగాణలో నీళ్లు, నిధులు, ఉద్యోగాల లక్ష్యాలను ఏ మేరకు సాధించారని అడిగారు. ఊరువాడ రాష్ట్రం మొత్తం మీద వీటిపై చర్చ జరగాలని, మేధావులు, విద్యార్థులు, జర్నలిస్టులు, కళాకారులు, ప్రజలు సదస్సు నిర్వహించి చర్చించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ భూస్వామ్య వ్యవస్థను పునర్నిర్మించారని మండిపడ్డారు.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆప్ నేత సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు