Pawan Kalyan: మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా మౌనమే అని.. ఏపీలో గిరిజన మహిళలపై అత్యాచార, హత్య ఘటనలు కలచి వేశాయని పవన్ అన్నారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు అని ప్రశ్నించారు. మహిళపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందనే వాస్తవాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయని వివరించారు. అయినా ప్రభుత్వం మౌనంగా, ఉదాసీనంగా ఉండటం ఆడబిడ్డలకు శాపంగా మారిందని మండిపడ్డారు. మహిళల మాన మర్యాదలకు భంగం వాటిల్లే సంఘటనలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకుంటున్నాయని.. పాలకులు పట్టించుకోకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పవన్ ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also:Panjagutta Nisha Case: నిషా కేసులో కొత్త ట్విస్ట్.. ఇరికించడానికే ఈ ప్లాన్
Also Read
- Motkupalli Narasimhulu: ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
- TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి..
అత్యాచారం ఘటనలపై బాధ్యతతో తీవ్రంగా స్పందించాల్సిన హోంమంత్రి తల్లి పెంపకంలోనే తప్పు ఉందని.. ఏదో దొంగతనానికి వచ్చి అత్యాచారం చేశారు లాంటి వ్యాఖ్యలతో తేలిగ్గా మాట్లాడటం వల్లే మృగాళ్లు పేట్రేగిపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా చట్టాలు చేశాం, పోలీస్ స్టేషన్లు పెట్టామని ప్రచార ఆర్భాటం తప్ప ఆడ బిడ్డకు మాత్రం ధైర్యం ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర పాలకుడు ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున ఓ యువతిపై అత్యాచారం జరిగి ఏడాది దాటినా ఇప్పటికీ ఓ నిందితుడిని పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్, శాంతిభదత్రల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు రోజు రోజుకీ పెరగటం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని పవన్ కళ్యాణ్ అన్నారు.
మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు? – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/S6L0tNnYOd
— JanaSena Party (@JanaSenaParty) September 19, 2022
తాజావార్తలు
-
Megastar Chiranjeevi : ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా ఆయనే ముందుంటాడు.. మరోసారి నిరూపించిన మెగాస్టార్..!
-
Vaibhav Sooryavanshi: అది బ్యాటింగ్ కాదు.. వైభవ్ బ్యాట్‌లో ఏదో ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఆటగాళ్లు..
-
Vibhav suryavanshi: ఢిల్లీ క్యాపిటల్స్ పశ్చాత్తాపం.. కొన్ని లక్షల కోసం వైభవ్‌ను వదులుకున్నారు..
-
Siddaramaiah: కర్ణాటకలో పవర్ ఛేంజ్.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
-
DK Shivakumar: వందల కోట్ల షాపింగ్ మాల్, కోట్ల సంపద.. కర్ణాటక కొత్త సీఎం వైభవం..
ట్రెండింగ్
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!