Panjagutta Nisha Case: నిషా కేసులో కొత్త ట్విస్ట్.. ఇరికించడానికే ఈ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Twist in Panjagutta Nisha Case: విజయసింహా అనే ఒక ఎమ్మెల్యే అనుచరుడు తనపై కత్తితో దాడి చేశాడని నిషా అనే మహిళ పెట్టిన కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇదంతా ఆ మహిళ ఆడిన డ్రామాగా పోలీసులు నిగ్గు తేల్చారు. విజయసింహాపై కోపంతోనే ఆమె ఈ డ్రామాకు తెరలేపినట్టు తేలింది. ఆమె గొంతుపై ఎలాంటి గాయాలు లేవని కూడా వెల్లడైంది. వైద్యులు ఈ విషయం చెప్పాక అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేయగా, అసలు గుట్టు బట్టబయలైంది. అసలేం జరిగిందంటే..
కొన్ని నెలల క్రితం విజయసింహాకు నిషాతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. విజయసింహా అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి రావడం, ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగడం చేశారు. అయితే.. ఈమధ్య అతడు నిషాను దూరం పెడుతూ వచ్చాడు. ఎన్నిసార్లు పిలిచినా ఆమె వద్దకు వెళ్లలేదు. దీంతో.. అతనిపై ఆమె కోపం పెంచుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించి, ఈ దాడి నాటకానికి తెరతీసింది. అర్థరాత్రి తన ఇంట్లోకి దూసుకొచ్చి మరీ, విజయసింహా తన గొంతు కోశాడని అబద్ధం చెప్పింది. అంతేకాదు, లైంగికంగా వేధిస్తున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి పంపించి, చికిత్స అందించారు.
Also Read
అయితే.. నిషా చెప్తున్న మాటల్లో వాస్తవం లేదని, ఆ సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని విజయసింహా ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో వైద్యులు నిషాకు ఎలాంటి గాయాలు కాలేదని, గొంతుపై కత్తి గాట్లు లేవని చెప్పారు. అప్పుడు పోలీసులు నిలదీయగా.. అసలు విషయం చెప్పింది నిషా. తనని దూరం పెడుతున్నందుకే, కోపంతో ఈ పనికి పాల్పడ్డానని చెప్పింది. అతడ్ని ఇరికించాలనే డ్రామా ఆడినట్టు ఒప్పుకుంది. దాంతో.. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇంటికి పంపించారు. మరోవైపు.. విజయసింహా ఇంతవరకూ ఫిర్యాదు చేయకపోవడంతో, పోలీసులు ఆ మహిళపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని తెలిసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?