Veera Siva Reddy: కడప రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబు, లోకేష్‌పై బీజేపీ నేత హాట్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veera Siva Reddy: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. కొన్ని ప్రాంతాల్లో కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి.. బహిరంగ విమర్శలు, ఆరోపణలు, ఆందోళనకు వరకు కూడా వెళ్లింది పరిస్థితి.. అయితే, కడప జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ కమలాపురం ఎమ్మెల్యే, బీజేపీ నేత జి. వీర శివారెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో పాటు టీడీపీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితమే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ సమక్షంలో బీజేపీలో చేరిన ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మతి తప్పిందని, అందుకే కడప జిల్లాలో ఇలాంటి వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నారని వీర శివారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో డబ్బులు ఇస్తేనే పదవులు వస్తాయని ఆరోపించారు. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రూ.30 కోట్లు ఇస్తేనే వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి నాయకుల నేపథ్యం, అర్హతలతో సంబంధం లేదని, డబ్బులు ఇచ్చిన వారికే పదవులు దక్కుతున్నాయని విమర్శించారు. ఇక, కమలాపురం నియోజకవర్గంలోని కోగటం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమిలో రెబల్స్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న జెడ్పీ చైర్మన్ పుత్తా నరసింహారెడ్డి కోగటం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంపై స్పందించిన వీర శివారెడ్డి పుత్తాపై తీవ్ర విమర్శలు చేశారు. 15 నుంచి 20 ఏళ్ల క్రితం వేసిన సిమెంట్ రోడ్లకు ప్రస్తుతం కొద్దిపాటి పూత వేసి, ఆ పనులను పుత్తా నరసింహారెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. పుత్తా గత చరిత్ర తెలుసుకునే చంద్రబాబు ఆయనకు జిల్లా స్థాయి పదవి ఇచ్చారా? అని ప్రశ్నించారు. పుత్తా నరసింహారెడ్డిపై భూకబ్జాలు, ఇసుక స్మగ్లింగ్‌కు సంబంధించిన ఆరోపణలు కూడా చేశారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
- BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
- MP YS Avinash Reddy Arrest: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
- Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!
500 ఎకరాల భూముల కబ్జా అంటూ ఆరోపణలు
మరోవైపు.. మాచిరెడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లో సుమారు 400 నుంచి 500 ఎకరాల భూములను కబ్జా చేశారని పుత్తా నరసింహారెడ్డిపై వీర శివారెడ్డి ఆరోపించారు. టీడీపీ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల కోసం డబ్బులు పంపిణీ చేసిందని విమర్శించారు. పులివెందుల, రాజంపేట ప్రాంతాల్లోనూ ఎన్నికల కోసం భారీగా డబ్బులు ఖర్చు చేశారని ఆరోపించారు. అంతేకాదు.. కోగటం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉందని వీర శివారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో పుత్తా నరసింహారెడ్డి ప్రభావం ఎంత? తన ప్రభావం ఎంత? అనేది ఎన్నికల ఫలితాలే తేలుస్తాయని అన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వెలువడే ఫలితాలతో ఎవరి బలమెంతో స్పష్టమవుతుందని పేర్కొన్నారు. టీడీపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరిన ఆయన.. కోగటం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పుత్తా నరసింహారెడ్డి నిలబెట్టిన అభ్యర్థి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. డబ్బుతో కాకుండా ప్రజాభిమానంతోనే రాజకీయాల్లో గెలవాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. వీర శివారెడ్డి వ్యాఖ్యలతో కడప జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Veera Siva Reddy: కడప రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబు, లోకేష్‌పై బీజేపీ నేత హాట్ కామెంట్స్!
-
Ram Charan : టైర్ వన్ హీరోల్లో రామ్ చరణ్‌కి నచ్చే క్వాలిటీస్ ఏంటంటే?
-
Train Trailer: ఒళ్లు గగుర్పొడిచేలా విజయ్ సేతుపతి, మిస్కిన్ ‘ట్రైన్’ ట్రైలర్! చూశారా?
-
Israel Political Crisis: ఇజ్రాయెల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాని పదవిని పంచుకునేందుకు నెతన్యాహు రెడీ!
-
Kakinada Municipal Corporation Elections: కాకినాడ కౌంటింగ్‌పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. వారికి నో ఎంట్రీ!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!