Pawan Kalyan: ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా మౌనమే అని.. ఏపీలో గిరిజన మహిళలపై అత్యాచార, హత్య ఘటనలు కలచి వేశాయని పవన్ అన్నారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు అని ప్రశ్నించారు. మహిళపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందనే వాస్తవాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయని వివరించారు.…