మద్యం ప్రియులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్...హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు 24 గంటల పాటు మూతపడనున్నాయి. నగరంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లలో ఆదివారం పూర్తిగా మూతపడనున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన నగరంలోని వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున వాడవాడలా రామనామ స్మరణ మార్మోగుతున్న నేపథ్యంలో.. నేడు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.
Liquor Ban : మధ్యప్రదేశ్‌లో మొదటి నుండి మద్యపాన నిషేధం ఒక పెద్ద సమస్యగా ఉంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు నిరంతరం మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
Madhya Pradesh: పురుషులు మద్యపానం మానేందుకు మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా ఇచ్చిన సలహా చర్చనీయాంశంగా మారింది. మహిళలు తమ భర్తలను ఇంట్లోకే మద్యం తెచ్చుకుని తాగమని చెప్పారు.
కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రస్తుతం బిహార్ రాజకీయాలను వణికిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్యం తాగితే చచ్చిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో సీఎం నితీష్ తీవ్రంగా స్పందించారు.
ఏపీలో రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. ఒకవైపు టీడీపీ వర్సెస్ వైసీపీ, మరోవైపు వైసీపీ వర్సెస్ జనసేన. ఇలా మాటల కోటలు దాటుతున్నాయి. తాజా ఏపీలో మద్యం అమ్మకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం. చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే అంటూ ట్వీట్…
ఏపీ సర్కార్ తీరుపై ఈమధ్యకాలంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. హిందువుల భూములను ఆక్రమించుకుని మసీదులు కట్టాలని ఎస్డీపీఐ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎస్డీపీఐ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అహ్మదుల్లా అవాకులు చవాకులు పేలుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల ఓట్ల కోసం కక్కుర్తి పడుతుందన్నారు. ఏపీని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష సీఎంకు లేదు. సంపూర్ణ మద్య నిషేధం అన్న జగన్ మద్యం తాగటానికి మరో గంట పొడిగించాడు. ఈ ప్రభుత్వంలో బ్రాందీలు వాళ్లకు…