Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు
- ఆరోగ్య సమస్యలపై భావోద్వేగంగా స్పందించిన పవన్
- 2019 ఓటమిపై విమర్శకులకు కౌంటర్
- జాతీయ స్థాయిలో జనసేన అడుగులపై సంకేతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. కేవలం 150 మంది సభ్యులతో తెలంగాణలో పుట్టిన జనసేన పార్టీ, నేడు 21.50 లక్షల క్రియాశీలక సభ్యత్వాలతో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూడా ప్రజలు జనసేన సిద్ధాంతాలను ఇష్టపడి పార్టీని విస్తరించమని కోరుతున్నారని ఆయన వెల్లడించారు. 12 ఏళ్లుగా పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా, ఇప్పుడు మాత్రం పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై గట్టిగా ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు.
తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కొన్ని భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుమ్ము, ధూళిలో నిరంతరం తిరగడం వల్ల తనకు సైనస్ సమస్య పెరిగిందని, దానివల్ల లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందని తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో అభిమానులు అత్యుత్సాహంతో లాగడం వల్ల భుజాల మధ్య కండరాలు తెగిపోయి (టియర్) తీవ్రమైన నొప్పి ఎదురైందని వివరించారు. అయితే తనకు చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఉండటం వల్ల తన శరీరం ఈ నొప్పులను తట్టుకోగలిగిందని, తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
రాజకీయాల్లో ఎదురైన ఒడిదుడుకులపై పవన్ ఘాటుగా స్పందించారు. “నేను సీఎం అయిపోవాలని పార్టీ పెట్టలేదు, సమాజంలో మార్పు తీసుకురావాలని, కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలని ఈ ప్రయాణం మొదలుపెట్టాను. నా జీవితాంతం తోడుంటామని చెప్పిన కొందరు మధ్యలోనే పార్టీని వదిలి వెళ్ళిపోయారు. కానీ జనసైనికులు, వీరమహిళలు మాత్రం నన్ను వదలకుండా కొండంత అండగా నిలబడ్డారు. నా పార్టీ అని భుజాలపై వేసుకుని నడిపించింది ఈ సాధక్లే” అని కొనియాడారు. 2019లో తాను రెండు చోట్లా ఓడిపోయినప్పుడు వెక్కిరించిన వారికి, ఒక్కొక్కరుగా పార్టీ వీడి వెళ్ళినప్పుడు విమర్శించిన వారికి నేడు 21.50 లక్షల సభ్యత్వాలే సమాధానమని ఆయన పేర్కొన్నారు.
చివరగా తమిళనాడు రాజకీయ పరిణామాలపై జరుగుతున్న చర్చపై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తమిళనాడులో ఒక నటుడు పార్టీ పెట్టి సీఎం అయితే, ఇక్కడ కొందరు అనవసరంగా హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన “ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి” అన్న సామెతను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని రాజకీయ పరిస్థితులు వేరని, ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులు వేరని గుర్తు చేస్తూ, ఇక్కడ రాజకీయాలను అక్కడితో పోల్చడం సరికాదని హితవు పలికారు. మొత్తానికి జనసేన ఇకపై జాతీయ స్థాయిలో తన అడుగులు వేయబోతోందనే సంకేతాలను పవన్ ఈ ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..