Off The Record : పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతను ఆ మంత్రిగారు బాగా… ఒంటబట్టించుకున్నారా. అందుకే ఏళ్ళ తరబడి టీడీపీని నమ్ముకుని ఉన్న వాళ్ళని కాదని… పదవుల పందేరంలో జంపింగ్ జపాంగ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారా? చివరికి సొంత నియోజకవర్గంలో సొంత కేడరే ఆమె కార్యక్రమాన్ని బహిష్కరిస్తోందా? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్‌లో అంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ఆ మినిస్టర్ ఎవరు? ఎందుకలా జరుగుతోంది? ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి సొంత…
CM Chandrababu: సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టే గుంటూరు- విజయవాడ మధ్య జిల్లాలో రాజధానిగా ప్రకటించాం.. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ పెడితే అవహేళన చేశారు.
JR NTR Fans Press Meet : హీరో జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. అలాంటి వ్యక్తిని ఇలా అంటే ఊరుకుంటామా. ఆయన గురించి మాట్లాడే స్థాయా నీది. ఆయన ఒక గొప్ప నటుడు. ఆ తల్లిని ఎందుకు అన్నావు. ఆమె ఏం పాపం చేసింది.…
Perni Nani: జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు టీడీపీ నేతలకు పులివెందుల ఎన్నికలు కాంట్రాక్ట్ కి ఇచ్చినట్లు ఉన్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆడవాళ్ళ ఓట్లు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లు వేసి వెళ్ళారు.. సిగ్గు, శరం లేకుండా బరితెగించి రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చుసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సందడి నెలకొంది. థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ సినిమా అనంతరం అందరి మదిలో ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ రోజులు ఉదయం కన్నుమూశారు. మాగంటి రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా నాలుగు చిత్రాలు నిర్మించారు. అదృష్టం కలిసిరాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కాలేకపోయిన ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మాగంటి గోపీనాథ్ సినిమా నేపథ్యాన్ని పరిశీలిద్దాం.. గోపీనాథ్ నాలుగు చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో 'పాతబస్తీ' చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతగా ఇది మొదటి సినిమా.…
వైసీపీ పై భూమా అఖిల ఫైర్ అయ్యారు.. వైసీపీ వెన్నుపోటు దినంతో ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. తాజాగా నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. "వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు... మద్య నిషేధం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు... వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత సోదరికి వెన్నుపోటు పొడిచారు.. సొంత చెల్లిని, తల్లిని బయటికి గెంటేసి జగన్ వారికి వెన్నుపోటు పొడిచారు.. రైతులకు, రాష్ట్రానికి…
YS Jagan : కొన్ని రోజులు మంట మీద పడ్డ మిరపకాయలాగా… చిటపటలాడిపోతారు. హాట్హాట్గా, ఘాటుగా కనిపిస్తారు. అంతలోనే… ఐస్ ముక్క పెట్టినట్టుగా కూల్ కూల్ అంటారు. పార్టీ వీడినా ఆ మాజీ ఎంపీని పాత బంధం అంత తేలిగ్గా వదలడం లేదా? గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, ఫైరైపోవడాలు అంతకంతకూ పెరుగుతున్నాయా? సడన్గా తన మాజీ బాస్ మీద ఆ మాజీ ఎంపీకి ఎదుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఎవరాయన? గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ…