Pawan Kalyan: కుల రాజకీయాలతో వ్యవస్థ నాశనమౌతోంది.. జనసేనాని ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Comments In Janasena Leaders Interaction: కుల ప్రాతిపదికన రాజకీయం చేస్తే, వ్యవస్థ నాశనం అవుతుందని.. వైసీపీ ఇదే చేస్తోందని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దిండి రిసార్ట్స్‌లో రాజోలు నియోజకవర్గ జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్టత చెందాలంటే భావజాలం అవసరమని, ఇదే జనసేన పార్టీ అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రాజోలులో వెలిగిన చిరు ద్వీపం.. ఈరోజు కడప రాజంపేట దాకా వెలుగుతోందని అన్నారు. రూ.200 లంచం తీసుకున్న ఉద్యోగికి మన దేశంలో శిక్ష పడుతోందని, కానీ రూ.5 వేల కోట్లు తినేసిన వాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అది మన దౌర్భాగ్యమని అన్నారు.
Online Order: నాలుగేళ్ల కిందట ఆర్డర్ చేస్తే.. ఇప్పుడు డెలివరీ చేసిన ఈ కామర్స్ సంస్థ..
Also Read
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
అర్థనారీశ్వరి తత్వం అంటూ మనం మహిళల్ని గౌరవిస్తాం కానీ.. రాజకీయాల్లో వాళ్లకు మూడోవంతు కూడా ఇవ్వలేకపోతున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆడపడుచులు మూడోవంతు ఉండాలని ఆకాంక్షించిన ఆయన.. మహిళల రిజర్వేషన్ల విషయంలో జనసేన ముందుంటుందని హామీ ఇచ్చారు. వర్గాలు ఉండటంలో తప్పు లేదు కానీ.. ఆ వర్గాలు పార్టీ జయించేలా ఉండాలే తప్ప, పార్టీని దిగజార్చే విధంగా ఉండకూడదని సూచించారు. రాజోలు విజయం తనకు ప్రేరణ ఇవ్వడం వల్లే.. ఉభయ గోదావరి జిల్లాల్లోనే కేంద్రీకృతం చేస్తున్నామన్నారు. మాటల్ని ఆయుధంగా మార్చుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. తాను గొడవలు పెట్టుకోవడానికి కూడా సిద్ధమేనన్న ఆయన.. తన జనసేన కార్యకర్తల్ని కాపాడుకోవడానికి తన ప్రాణాల్ని అడ్డుపెడతానని చెప్పుకొచ్చారు.
Actress Jyothi: కేపీ చౌదరి డ్రగ్స్ కేసుపై నటి జ్యోతి రియాక్షన్.. ఆ హక్కు ఎవరిచ్చారు?
ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ నుంచి విముక్తి కలిగించాలని.. అది జరగాలంటే ముందు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీని జీరో చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లులో ఒక్క చోట కూడా వైసీపీ గెలవకూడదన్నారు. తమ ఓట్లతో రాపాక అసెంబ్లీకి వెళ్లారని.. రాపాక లాంటి వారిని రీకాల్ చేయాలని చెప్పారు. వైసీపీ చేసినట్లు తాను కుల రాజకీయాలు చేయలేనన్న పవన్.. విభిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యుల్ని తీసుకున్నట్లు వివరించారు.
తాజావార్తలు
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!