ఒక్క విషయం గుర్తుంచుకొండి.. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను.. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు.. ఇప్పటికే ఏడాది గడిచింది.. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది... అప్పుడు మీకు సినిమా చూపిస్తాను.. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా అన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక పోలీసులు ఆంక్షలు విధించారని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు పన్నినా.. జగన్ ప్రవాహాన్ని అడ్డుకోలేరన్నారు. గతంలో ఎవరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదని ఫైర్ అయ్యారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అవసరం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెబుతారు అని జగ్గంపూడి…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో చేరుకోనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని వైసీపీ అధినేత ఆవిష్కరించనున్నారు. పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రజలు జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు గుంటూరు నగరంలో ప్రతిచోటా అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా…
నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత, ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహా ఆవిష్కరణ అనంతరం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి..…