Vidadala Rajini: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజని.. వైసీపీని వీడేందుకు సిద్ధం అవుతున్నారని.. త్వరలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారని.. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటూ పెద్ద ప్రచారమే జరిగింది.. దీంతో, విడదల రజిని.. వైసీపీకి బైబై చెబితే.. ఏ పార్టీలో చేరతారు అనే ప్రచారం కూడా సాగింది.. అయితే, ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి విడదల రజిని.. బీసీ మహిళపై తప్పుడు ప్రచారం చేయడమే తెలుగుదేశం పార్టీ నేతల లక్ష్యం అని మండిపడ్డారు.. తాను చిలకలూరిపేట నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.. అసలు సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దు అని విజ్ఞప్తి చేశారు విడుదల రజని..
Read Also: Ind vs SA1st T20I: శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. మొదట బ్యాటింగ్ చేసేది ఎవరిదంటే..?
ఇక, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేపట్టాం.. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 64 వేల 511 సంతకాలు సేకరించాం.. సేకరించిన సంతకాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుందన్నారు రజని.. చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు విద్యార్థులు మృతి చెందడం బాధాకరం అన్నారు.. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారకుడు ఒక పోలీసు కుమారుడే… ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. పోలీసు ఉద్యోగి కొడుకు ఉన్నాడు కాబట్టే పోలీసుల వ్యవస్థ కేసు విచారణలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.. వైసీపీ నేతలను టార్గెట్ చేసి వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసులకు తెలుసు అని ఫైర్ అయ్యారు.. ఐదు కుటుంబాల్లో విషాదం నింపిన వారిని కఠినంగా శిక్షించాలి.. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి విడదల రజిని..