కరోనా అనంతరం బైకుల వాడకం ఎక్కువైపోయింది. దీంతో బైకుల అమ్మకాలు కూడా పెరిగిపోయాయి. వాహనదారులను అట్రాక్ట్ చేయడానికి టూవీలర్ తయారీ సంస్థలు అదిరిపోయే ఫీచర్లతో బైక్ లను తీసుకొస్తున్నాయి. స్పోర్టీ లుక్ అడ్వాన్డ్స్ ఫీచర్లతో టీ వీలర్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. కాగా ఇటీవల ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ కీవే ఇండియా సరికొత్త మోడల్ ను రిలీజ్ చేసింది. కీవే కె300 ఎస్ఎఫ్ పేరిట సూపర్ బైక్ ను తీసుకొచ్చింది. అయితే కంపెనీ తన సేల్ ను పెంచుకునేందుకు బ్లాక్ బస్టర్ డీల్ ను ప్రకటించింది. ఏకంగా ఈ బైక్ పై రూ. 60 వేల డిస్కౌంట్ అందిస్తోంది.
అంతే కాదు ఈ బైక్ కావాలనుకునే వారు కేవలం రూ. 3 వేలతో బుక్ చేసుకునే ఛాన్స్ కంపెనీ కల్పిస్తోంది. అయితే కంపెనీ తీసుకొచ్చిన ఈ ఆఫర్ మొదటగా కొనుగోలు చేసే 100 కస్టమర్లకు మాత్రమే వర్తించనున్నది. దీనిని రూ.1.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రత్యేక ధరకు సొంతం చేసుకోవచ్చు. మీరు కొత్త బైక్ ను కొనాలనే ప్లాన్ లో ఉంటే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఈ బైక్ డిజైన్, ఫీచర్లు, పనితీరు మోటరిస్టులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కీవే కె300 ఎస్ఎఫ్ 292.4cc లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది.
ఇది 8,750 rpm వద్ద 27.5 hp పవర్, 7,000 rpm వద్ద 25 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటుంది. డిస్క్ బ్రేక్‌లతో అధునాతన డ్యూయల్-ఛానల్ ABSని అందించారు. పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీనిలో పెట్రోల్, గేర్ బాక్స్ ఇండికేటర్స్, స్పీడ్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ 12.5 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది.