శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొత్త సంవత్సరం రోజు సిఫార్సు లేఖలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 31వ తేదీన ఫుల్‌గా ఎంజాయ్ చేసి.. మరునాడు.. అంటే జనవరి 1వ తేదీన గుడి ముందు బారులు తీరుతుంటారు.. తెలుగు సంవత్సరంగా చూస్తే.. జనవరి 1వ తేదీకి ప్రాధాన్యత లేకపోయినా.. ఆంగ్ల క్యాలెండర్‌లోని జనవరి 1న మాత్రం ఆలయాలకు భక్తులకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు.. ఇక, వారికి కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.. శనివారం రోజు నూతన సంవత్సరం సందర్భంగా సిఫార్సు లేఖలు స్వీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జనవరి 1తో పాటు జనవరి 13 నుండి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.. అయితే, స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. భక్తులు కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ స్పష్టం చేసింది..
Read Also: డిసెంబర్ 31, శుక్రవారం దినఫలాలు
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
మరోవైపు.. జనవరి 11 నుండి 14వ తేదీ వరకు వసతి గదుల ఆడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేసింది టీటీడీ.. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయించాలని నిర్ణయించింది.. జనవరి 11 నుండి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు. ఇక, వరుసగా రెండో సంవత్సరం కూడా శ్రీవారి దర్శనాలు, హుండీ ఆదాయంపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది.. ఈ ఏడాది శ్రీవారిని కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని.. హుండీ ద్వారా శ్రీవారికి రూ.826 కోట్లు ఆదాయం సమకూరినట్టు టీటీడీ ప్రకటించింది.. ఇక, ఈ ఏడాది కూడా టీటీడీ బడ్జెట్ అంచనాలు తప్పాయి.. అయితే, ఈ ఏడాది హుండీ ద్వారా 1,100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది టీటీడీ.. కానీ, అది రూ.826 కోట్లకే పరిమితం అయ్యింది.. కరోనా ఎఫెక్ట్‌తో శ్రీవారిని దర్శించుకునే భక్తులపై ఆంక్షలు విధించడం.. ఆ తర్వాత క్రమంగా అనుమతి ఇచ్చినా.. సాధారణ పరిస్థితులు లేకపోవడంతో.. ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!