Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Porel Bail: ఢిల్లీ క్యాపిటల్స్, బెంగాల్ వికెట్‌కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్‌కు బెయిల్ మంజూరైంది. అత్యాచారం, దాడి, క్రిమినల్ ఇంటిమిడేషన్ తదితర ఆరోపణలకు సంబంధించిన కేసులో గత ఆగస్టులో అరెస్టయిన పోరెల్.. నెల రోజులకు పైగా జైలులో ఉన్నాడు. తాజాగా అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హూగ్లీ జిల్లాలో పోలీసులు గత ఆగస్టు 11న అభిషేక్ పోరెల్‌ను అరెస్టు చేశారు. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి.. తనతో లైంగిక సంబంధం పెట్టుకుని మోసం చేశాడని ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు. 36 రోజుల పాటు జైలులో గడిపిన అనంతరం పోరెల్‌కు చుంచురా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read
- Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
- BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
కర్ణాటకకు చెందిన ఓ యువ వైద్య విద్యార్థిని జూన్ 23న మొగ్రా పోలీస్ స్టేషన్లో అభిషేక్ పోరెల్‌పై ఫిర్యాదు చేసింది. తాము సుమారు మూడున్నర సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్నామని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. తామిద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లామని, ఆ తర్వాత పోరెల్ తనను దూరం పెట్టాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లైంగికంగా వాడుకున్నాడని వైద్య విద్యార్థిని ఫిర్యాదులో రాసుకొచ్చింది. సుమారు ఏడాదిన్నర క్రితం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆ సమయంలో పోలీసుల జోక్యం ఉన్నప్పటికీ అప్పట్లో ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదట.
జూన్‌లో ఫిర్యాదు నమోదైన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అభిషేక్ పోరెల్ చందన్నగర్లోని నివాసానికి పోలీసులు పలుమార్లు వెళ్లినప్పటికీ ఆయన అక్కడ కనిపించలేదని రిపోర్టులు పేర్కొన్నాయి. దీంతో ఫిర్యాదు చేసిన యువతి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అనంతరం జూలై 20న పోరెల్‌ను అరెస్టు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి. కాగా పోరెల్ గతంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. ప్రస్తుతం బెయిల్ మంజూరు కావడంతో ఈ కేసులో తదుపరి న్యాయపరమైన ప్రక్రియ ఎలా సాగుతుందనేది కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!