Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Golmaal 5 Release Date: బాలీవుడ్లో కొన్ని కామెడీ ఫ్రాంచైజీలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో ‘గోల్మాల్’ సిరీస్ కూడా ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే నాలుగు భాగాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు ఐదో సినిమా రాబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ కామెడీ ఎంటర్టైనర్ ‘గోల్మాల్ 5’ (Golmaal 5) రిలీజ్ డేట్ వచ్చేసింది. కొత్త సంవత్సరం కానుకగా ఈ క్రేజీ కామెడీ మూవీని 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఈ రోజు (సెప్టెంబర్ 19) ఒక అదిరిపోయే మోషన్ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.
ఈ ఐదవ భాగంలో పాత గోల్మాల్ గ్యాంగ్ అంతా మళ్లీ కలిసి హంగామా చేయబోతోంది. అజయ్ దేవగన్‌తో పాటు అర్షద్ వార్సి, శ్రేయాస్ తలపడే, కునాల్ ఖేము, తుషార్ కపూర్ నవ్వులు పూయించడానికి రెడీ అయ్యారు. అయితే ఈసారి ఫ్యాన్స్‌కు డబుల్ థ్రిల్ ఇస్తూ, మొదటి భాగంలో నటించిన శర్మాన్ జోషి చాలా కాలం తర్వాత మళ్లీ ఈ ఫ్రాంచైజీలోకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. వీరందరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఈ సారి విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సరికొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇప్పటివరకు వచ్చిన నాలుగు గోల్మాల్ సినిమాలు ఒక్కో భాగంలో ఒక్కో కొత్త ఎలిమెంట్‌ను తీసుకొచ్చాయి. మొదటి సినిమా కామెడీతో సూపర్‌హిట్ కాగా, రెండో భాగంలో కరీనా కపూర్‌తో సీరియల్ డ్రామా నేపథ్యాన్ని జోడించారు. మూడో భాగంలో గోపాల్, మాధవ్, లక్ష్మణ్ త్రల మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. నాలుగో భాగంలో రోహిత్ శెట్టి కామెడీకి హారర్‌ను జోడించి కొత్త ప్రయోగం చేశారు. ఇప్పుడు ‘గోల్మాల్ 5’ లో రోహిత్ శెట్టి ఎలాంటి కొత్త కాన్సెప్ట్‌ను తీసుకురాబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, శర్మన్ జోషి వంటి పాత ఫేవరెట్లతో పాటు అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడంతో ఈసారి గోల్మాల్ గ్యాంగ్ మరింత రచ్చ చేసేలా కనిపిస్తోంది. ఇక అజయ్ దేవగన్‌కు 2026, 2027లో వరుస సినిమాలు ఉండగా, దృశ్యం 3పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి గోల్మాల్ 5 మాత్రం 2027 సంక్రాంతి సీజన్లో నవ్వుల సందడి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!