దీపావళి అంటే చిన్నారులు, పెద్దలంతా ఆనందంగా జరుపుకునే పండుగ.. ఓవైపు పూజలు, నోములు, వ్రతాలు.. మరోవైపు బాణసంచా, స్వీట్లు.. అదంతా ఓ జోష్.. అయితే, అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదుగా.. ఓ గ్రామంలో దీపావళి పేరు చెబితేనే వణికిపోతూరు.. దీపావళి వేడకులకు దూరంగా ఉంటారు.. అదే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామం. ఈ గ్రామంలో ఉండే ప్రజలు కొన్ని దశాబ్దాలుగా దీపావళి, నాగుల చవితి పండుగలను బహిష్కరించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ శతాబ్దంలో సైతం ఆపల్లె మూఢ విశ్వాసానికి కట్టుబడి ఉంది. పూర్వం దీపావళి వేడుకలు జరుగుతుండగా.. ఒకరిద్దరు చనిపోయారట.. మరోవైపు, నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి వచ్చే సమయానికి ఉయ్యాలలో బిడ్డను పాము కరవడంతో ఓ పసిబిడ్డ మృతి చెందింది. దీంతో నాటి నుంచి దీపావళి, నాగుల చవితి పండగలకు దూరంగా ఉంటున్నారు పున్నానపాలెం గ్రామస్తులు. ఓ మూఢ నమ్మకానికే నాటి నుంచి నేటి వరకూ కట్టుబడి ఉంటున్నారు ప్రజలు.
Read Also: WHO warns: భారత్‌లో పెరిగిపోయిన బద్ధకస్తులు.. డబ్ల్యూహెచ్‌వో సీరియస్ వార్నింగ్..
తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని.. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు గ్రామస్తులు. చిన్నారులకు పండగ జరపాలని, మతాబులు, చుచ్చు బుడ్డులు వెలిగించాలని ఉన్నా.. కోరికను అనుచుకుంటున్నామని చెబుతున్నారు. నాడు అమావాస్య రోజు వరుసగా చెనిపోవడం, పశువులు మృతి చెందటంతో తాము పండగ జరపలేదని, పెద్దలు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటున్నామని గ్రామస్తులు చెబుతున్నమాట… పెద్దల మాటను చద్ది మూటగా భావించడం మినహా ఇందులో తప్పొప్పులు కనిపించడం లేదని చెబుతున్నారు స్థానికులు.. నేటి యూవత, చిన్నరులు మనసుల్లో పండగ చేసుకొవలని ఉన్నా.. సంవత్సరాలుగా వస్తున్న ఆచారం , నమ్మకాన్ని గౌరవిస్తున్నమని చెబుతున్నారు. మొత్తంగా.. ఇతర హిందూ పండుగలు అన్నీ ఘనంగా జరుపుకే ఈ పల్లె ప్రజలు మాత్రం.. ఇప్పటికీ దీపావళి, నాగుల చవితి పండగలు మాత్రం దూరంగానే ఉంటున్నారు.