కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ నారాయణరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన వారు మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. కొడాలినాని నిర్వహిస్తున్న జూద క్రీడలు బయటపడతాయన్న భయంతోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ప్రత్నిస్తున్నారని నారాయణరావు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించని మంత్రి నాని, నేడు కే కన్వెన్షన్ లో ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించడం, అతని భయాన్ని తెలియజేస్తుందని నారాయణరావు అభిప్రాయపడ్డారు.
Read Also: ఎన్జీవో హోంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల భేటీ
Also Read
క్యాసినో మంత్రిగా నాని: కొల్లురవీంద్ర
టీడీపీలో క్రమశిక్షణతో ఉన్న మంత్రి కొడాలి నాని, వైసీపీలోకి వెళ్లిన తర్వాతే బూతుల మంత్రి, పేకాట మంత్రిగా బాగా పేరుగడించారని కొల్లు రవీంద్ర అన్నారు.ఆదిలోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం క్యాసినో మంత్రిగా పేరు గడించిన నాని అరాచకం భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటుందో ఊహించడమే కష్టంగా ఉందని కొల్లు రవీంద్ర అన్నారు.
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..