మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన వారు మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. కొడాలినాని నిర్వహిస్తున్న జూద క్రీడలు బయటపడతాయన్న భయంతోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ప్రత్నిస్తున్నారని నారాయణరావు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించని మంత్రి నాని, నేడు కే కన్వెన్షన్ లో ఎస్సీ సెల్…