Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Rs10,000 Recharge Plan: రిలయన్స్ జియో వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్‌లో ఏకంగా 3 సంవత్సరాల వ్యాలిడిటీ లభిస్తుంది. దీని ద్వారా యూజర్లు తరచూ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీర్ఘకాలం సేవలను పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్, డేటా, SMSలతో పాటు OTT సబ్స్క్రిప్షన్లు, ఇతర అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ ధర రూ.10,000. ఒకసారి రీచార్జ్ చేసుకుంటే దాదాపు 3 సంవత్సరాల వరకు మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, ఈ కాలంలో టారిఫ్ ధరలు పెరిగినా ఇప్పటికే తీసుకున్న ప్లాన్‌పై అదనపు ప్రభావం ఉండదనే ప్రయోజనం కూడా ఉంటుంది.
జియో 3 సంవత్సరాల రీచార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్రత్యేక ప్లాన్‌కు 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ ద్వారా దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు ఉచిత నేషనల్ రోమింగ్ ప్రయోజనం లభిస్తుంది. అలాగే వినియోగదారులకు ప్రతిరోజూ.. 2.5GB హై-స్పీడ్ డేటా, 100 ఉచిత SMSలు, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్
వంటి ప్రయోజనాలు అందుతాయి.
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు పెట్టిన సూచీలు..
- Gold & Silver Price Drop: ధన త్రయోదశి వేళ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- E20 Petrol New Controversy: E20 పెట్రోల్‌పై మరో వివాదం.. ఏకంగా 31.2 శాతం ఇథనాల్! ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు
- Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
OTTతో పాటు అదనపు ప్రయోజనాలు
ఈ రీచార్జ్ ప్లాన్‌లో డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా పలు డిజిటల్ సేవలను కూడా అందిస్తున్నారు. ఇందులో
JioHotstar Mobile + Hollywood సబ్స్క్రిప్షన్
12 నెలల Canva Pro Lite సబ్స్క్రిప్షన్
50GB JioAICloud స్టోరేజ్
ప్లాన్ ముఖ్యమైన ప్రయోజనాలు
ధర: రూ.10,000
వ్యాలిడిటీ: 3 సంవత్సరాలు
డేటా: రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా
5G డేటా: అన్లిమిటెడ్ 5G డేటా
కాలింగ్: అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్
SMS: రోజుకు 100 SMSలు
OTT: JioHotstar Mobile + Hollywood సబ్స్క్రిప్షన్
Canva: 12 నెలల Canva Pro Lite సబ్స్క్రిప్షన్
క్లౌడ్ స్టోరేజ్: 50GB JioAICloud స్టోరేజ్
ప్లాన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?
సమాచారం ప్రకారం, ఈ కొత్త జియో రీచార్జ్ ప్లాన్ నవంబర్ 7 నుంచి MyJio యాప్, Jio.com ద్వారా అందుబాటులోకి వస్తుంది.
జియో రూ.15 డేటా ప్లాన్ కూడా..
ఇదిలా ఉండగా, జియో ఇటీవల రూ.15 విలువైన డేటా ప్లాన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రధానంగా అత్యవసర డేటా అవసరాల కోసం రూపొందించారు. ఈ ప్లాన్‌లో
ధర: రూ.15
వ్యాలిడిటీ: 24 గంటలు
డేటా: 1GB లభిస్తుంది.
రెగ్యులర్ ప్లాన్‌లో ఉన్న డేటా పూర్తయినప్పుడు అత్యవసరంగా ఈ డేటా ప్యాక్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనితో హై-స్పీడ్ ఇంటర్నెట్, 4K వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, పెద్ద ఫైళ్ల డౌన్లోడ్ వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!