అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడి అంతు చూస్తా: లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా.. వారిని పరామర్శించేందుకు లోకేష్ బుధవారం ఉదయం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలకగా.. అనంతరం ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లోకేష్ వారికి ధైర్యం చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడి అంతు చూస్తానంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు.
Read Also: ఏపీ సీఎం జగన్ ఒడిశా టూర్ సక్సెస్ అయిందా..?
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
ఇప్పటికే తన మీద 11 కేసులు పెట్టారని.. ఇప్పుడు ఇంకో కేసు పెడితే 12 అవుతాయని.. వాటితో ఏం చేయగలరు అని లోకేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం ఎయిడెడ్ కాలేజీల విలీనంపై అనంతపురంలోని విద్యార్థి సంఘాల నేతలతో లోకేష్ చర్చలు జరిపారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటీకరించడం వల్ల ఫీజుల భారంపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాగా విద్యార్థుల పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని టీడీపీ నేతలతో పాటు వామపక్షాల నేతలు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా ఖండించారు.
అనంతపురం వెళుతున్న నారా లోకేష్ కు మార్గమధ్యలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలుకగా..ఈ సందర్బంగా నారా లోకేష్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ నా మీదనే 11 కేసులు పెట్టారు. ఏ పీకుతారు…రేపు అధికారం లోకి రాగానే వారి సంగతి చూస్తా…అంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. pic.twitter.com/oEGm6KON4W
— Telugu Desam Party (@JaiTDP) November 10, 2021
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!