Nara Chandrababu Naidu: కుప్పంలో రౌడీయిజం చేస్తున్నారు.. వేషాలు వేస్తే పులివెందుల వరకు తరుముతాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు.. కొన్ని ప్రాంతాల్లో.. చంద్రబాబు టూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శాంతిపురం మండలం, కొంగణపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వానికి శీతకన్ను వేసింది ఫైర్ అయ్యారు.. నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదని ఆరోపించిన ఆయన.. ఈ చేతగాని ప్రభుత్వం… మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు.. నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు ఇచ్చాను.. నాకు ఓట్లు వేయలేదని నేను పులివెందులలో పనులు నిలిపి వేయలేదని స్పష్టం చేశారు.
Read Also: File Level Pumping System: సచివాలయంలో కొత్త విధానం.. ఫైల్ లెవల్ జంపింగ్‌పై జీవో జారీ
Also Read
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
కుప్పంలో 100 కోట్లు పేదల ఇళ్లపై ఖర్చు పెట్టాం… వాటిని నిలిపివేశారని విమర్శించారు చంద్రబాబు.. కుప్పంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలని 1350 కోట్లు కేటాయించి సగం ఖర్చు చేశాం.. కానీ, కుప్పానికి రావాల్సిన 1350 కోట్ల నిధుల జీవోలు రద్దు చేసి ఇప్పుడు రూ. 65 కోట్లు ఇస్తాం అంటున్నారని ఫైర్ అయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఉత్తమ విధానానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాను.. మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చాం అని గుర్తుచేసిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్లలో ఒక్క ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చారా? అని నిలదీశారు.. రాష్ట్రంలో సంక్షేమం కాదు… అందరినీ బాదుడే బాదుడు అని ఎద్దేవా చేశారు.. 300 యూనిట్ల విద్యుత్ వాడితే అమ్మఒడి పథకం కట్.. టాక్సీ ఉన్నా పథకాలు తీసేస్తున్నారన్నారు. ఇక, మన నియోజకవర్గం లో కొందరు రౌడీయిజం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. ఇక్కడ వేషాలు వేసే వారిని పులివెందుల వరకు తరుముతామని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
నా పర్యటనకు కావాలని అడ్డంకులు సృష్టిస్తారా? అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు.. పోలీసులు న్యాయంగా ఉండాలి.., కానీ, మాట్లాడితే ఎఫ్ఐఆర్ పెడుతున్నారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీకి చెందిన దొంగలు, రౌడీలు గుర్తు పెట్టుకోవాలి. అందరి ఆటలు కట్టిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.. టీడీపీ మద్దతు దారులకు పెన్షన్ లు, పథకాలు నిలిపివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయం చేస్తామన్న ఆయన.. నిలిపివేసిన పథకాలు వడ్డీ తో సహా ఇప్పిస్తాం అని ప్రకటించారు.. అందరూ పన్నులు కడుతున్నారు.. ఇదేమి వైఎస్ జగన్ సొంత సొమ్ము కాదు.. కుప్పంలో పథకాలు ఎందుకు నిలిపి వేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!