Nadendla Manohar Talks About Srikakulam Event: ఆంధ్రప్రదేశ్‌లో కొందరు వనరులు దోచుకొని.. నాయకత్వాన్ని ఎదగనీయకుండా రాజకీయం చేస్తున్నారని పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఉపాధి, పెట్టుబడులు ఏమాత్రం లేవని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగం మరింత పెరిగిందని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో యువశక్తి కార్యక్రమం సభా స్థలంలో ఆయన మాట్లాడుతూ.. సభ కోసం గత వారం రోజుల నుంచి జనసేన నేతలు కృషి చేస్తున్నారన్నారు. ఈ సభతో వర్తమాన రాజకీయాలకు ఒక దిశానిర్దేశం అవుతుందన్నారు. పార్టీ నుంచి గెలిచిన ఎంపీటీసీలు, జెట్పీటీసీలతో ఈ సభ 12వ తేదీన 12 గంటల నుంచి ప్రారంభం అవుతుందని, ఇందులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. వందమందిని యువతను షార్ట్ లిస్ట్ చేసి, వారితో మాట్లాడిస్తామన్నారు.
Baby Powder: జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఊరట.. బేబీ పౌడర్ తయారీ, విక్రయాలకు అనుమతి..
తమ సభకు వివేకానంద వికాశ వేదికగా నామకరణం చేశామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నాలుగు ద్వారాలకు గిడుగు రామ్మూర్తి, వీరనారి గున్నమ్మ, అల్లూరి సీతారామరాజు, కొడి రామ్మూర్తి నాయుడు పేర్లు పెట్టామని వివరించారు. మొత్తం 35 ఎకరాల్లో ఈ సభకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశామని, తమ వాలంటీర్‌లకు పోలీసులు సహకరిస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే.. తమ పాలసీ విధానం ఏ విధంగా ఉండబోతుందన్నది తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సమష్యలు, యువత సమష్యలపై రెండు రాజకీయ తీర్మానాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో బటన్ నొక్కుడు తప్ప.. అభివృద్ధి ఏమీ లేదని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మత్స్యకారులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని, మత్స్యకార భరోసాలో ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. వర్గానికో, కులానికో కాకుండా ప్రజల కోసం తమ పార్టీ పని చేస్తుందన్నారు.
Kollegio Neo: తక్కువ ధరకే మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజ్ ఎంతో తెలుసా?