ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే మానసిక వేధనకు గురై షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్థాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతల్‌కుంటకు చెందిన సుధేష్ణకు(28) నాలుగేళ్ల కిందట అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్‌కుమార్ ఉన్నాడు.…
బెంగళూరులో గత రెండు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమాని తీవ్రంగా నష్టపోయాడు.
భారతీయులకు బంగారు ఆభరణాల పట్ల మక్కువ ఎక్కువ. పండుగైనా,పెళ్లి అయినా సరే ప్రతిసారీ కస్టమర్లు బంగారు ఆభరణాలను తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. పండుగలు, వేడుకల సందర్భంగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు.
దొంగలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుపోతున్నారు. పక్కవారికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా.. చాలా ఈజీగా చోరీలు చేస్తున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. భద్రాచలంలో అదే జరిగింది. చాలా సులువుగా.. ఏ మాత్రం కష్టపడకుండా.. ఎవ్వరికి కొంచెం కూడా అనుమానం రాకుండా.. బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అంతా అయిపోయాక చూసుకుంటే తన ఆభరణాలు మాయం అయ్యాయని గ్రహించాడో వ్యక్తి. బూర్గంపాడుకు చెందిన సత్యవ్రత.. భద్రాచలంలోని యూబీరోడ్డులో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కొన్ని…
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎప్పటి నుంచో వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు ప్రజలు.. వజ్రాలు దొరికి కొందరు లక్షలు సంపాదిస్తే.. కొందరు కోటీశ్వరులు అయ్యారని చెబుతారు.. ఇక, చాలా మందికి నిరాశే మిగిలింది.. అయితే, ఉన్నట్టుండి ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరప్రాంతంలో బంగారపు నగలు దొరుకుతున్నాయనే మాట.. స్థానికుల చెవినపడింది.. దీంతో.. గత రెండు రోజులుగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం జల్లెడ పడుతున్నారు స్థానిక మత్స్యకారులు.. మహిళలు, చిన్నారులు సైతం తీరంలో బంగారం…