మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. నేను తెలుగులోనే మాట్లాడతానని స్పష్టం చేశారు.. తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లీషులో మాట్లాడటం ఎందుకో నాకు అర్ధం కాదన్నారు.. మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని హెచ్చరించారు.
రాజకీయ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. రాజకీయ నాయకుడు ఎప్పుడూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని సానుకూలంగా స్పందించాలన్నారు.. ప్రజా నాయకుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.. అప్పుడే మన వద్దకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు సమస్యలను చెప్పుకోగలరు అన్నారు..
నేను క్షేత్ర స్థాయి నుండి భారత దేశ రెండో అత్యున్నత పదవి వరకు వెళ్లాను.. నాకు ఇచ్చిన బాధ్యత నేను సమర్ధవంతంగా నిర్వహించాను.. కానీ, నాకు నచ్చిన పదవులు రాజ్యాంగ పదవులు కాదు.. ప్రజలతో మమేకమయ్యే పదవులు నాకు ఎంతో ఇష్టం అంటూ మరోసారి తన మనసులోని మాటలను బయటపెట్టారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. ఏపీలో పర్యటిస్తున్న ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ.. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. నిన్నటి నిన్నే ఆయన.. తాను…