Undavalli Sridevi: నాపై తప్పుడు ప్రచారం.. దళిత మహిళను కాబట్టే చులకన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Undavalli Sridevi: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ విజయం సాధించింది.. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి అనురాధ విక్టరీ కొట్టారు.. దీంతో, వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు అనేది స్పష్టమైపోయింది.. ఈ నేపథ్యంలో.. కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు కూడా ఈ కోవలోనే హల్ చల్ చేస్తోంది.. అయితే, ఆ వార్తలను కొట్టిపారేశారు ఉండవల్లి శ్రీదేవి.. రహస్య ఓటింగ్‌లో నా పేరు ఎలా చెబుతారు..? అని నిలదీశారు.. ఈరోజు ఉదయమే మా అమ్మాయితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశానంటూ ఓ ఫొటోలను విడుదల చేసిన ఆమె.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకిచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేశానని స్పష్టం చేశారు.. కానీ, నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. దళిత మహిళను కాబట్టే నేనంటే చులకన చేసి మాట్లాడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
Read Also: Sajjala: ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు.. టీడీపీకి సజ్జల సవాల్
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
కాగా, మా ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.. మాకు 7 సీట్లు రాకపోవడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు ఎవరినో ప్రలోభపెట్టారని అర్థమవుతోందన్న ఆయన.. ప్రలోభాలకు గురైన వాళ్లను వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు అలవాటేనని మండిపడ్డారు. తెరవెనుక డబ్బులు పని చేశాయని అనుకోవాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. క్రాస్ ఓటింగ్ జరగకుండా మానవ ప్రయత్నం చేశాం.. అయినా జరిగింది.. ఇక, క్రాస్ ఓటింగ్‌పై పార్టీ అంతర్గతంగా చర్చిస్తుందన్నారు. ఏదేమైనా.. ప్రలోభపెట్టి గెలవడాన్ని సక్సెస్ అనుకోకూడదు.. ప్రలోభపెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అంటూ మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!