Sajjala: ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు.. టీడీపీకి సజ్జల సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ.. తాజాగా ఎమ్మెల్యే కోటాలోనూ గెలుపు రాజకీయంగా ఆసక్తి రేపింది. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తుందని ఆపార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, అధికార వైసీపీ మాత్రం టీడీపీకి అంత సీన్ లేదని చెబుతోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ.. ఓ స్థానాన్ని కోల్పోవడంతో ఆపార్టీకి నిరాశలో ఉంది. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సంఖ్యాబలం ఉంది కాబట్టే ఏడుగురు అభ్యర్థుల్ని పోటీలో పెట్టామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. డబ్బులు ఎర చూపడం వల్లే టీడీపీ ఒక స్థానంలో గెలిచిందని ఆరోపించారు. డబ్బులు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పారు.
Also Read: MLA Quota MLC Elections Results: సంబరాల్లో టీడీపీ శ్రేణులు.. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడు..!
గతంలోనూ అలాగే టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా అదే చేశారని సజ్జల చెప్పారు. ఈ ఒక్క గెలుపు చూసుకుని తాము ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ సవాల్ విసిరారు. క్రాస్ ఓటింగ్ పాల్పడ్డవారిని గుర్తించామన్నారు. సరైన సమయంలో చర్యలుంటాయని సజ్జల స్పష్టం చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
Also Read:Samantha: బహుశా.. బంగారు బొమ్మ అంటే ఇలానే ఉంటుందేమో
కాగా,ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు.చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమెకు అనుకూలంగా ఓటు వేసిన ఆనలుగురు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు టీడీపీకి పడినట్లు తెలుస్తోంది. అయితే, మిగత రెండు ఓట్లు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి ఖండించారు.
- Tags
- MLC ELECTIONS
- Sajjala
- tdp
- YSRCP
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!