MLA Sudhakar Babu Fires On Pawan Kalyan Over AP Volunteers Issue: వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్.. వాలంటీర్ వ్యవస్థపై హీనంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని కోడుమూరులో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలెవ్వరూ వాలంటీర్ వ్యవస్థ బాగోలేదని చెప్పలేదని తెలిపారు. ప్రజల దగ్గర ఆమోదం పొందిన వ్యవస్థను తీసేయ్యమని చెప్పటానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎవరు? అని ప్రశ్నించారు. అసలు వాలంటీర్లను తీసెయ్యమని చెప్పే హక్కు ఆ ఇద్దరికి ఎవరిచ్చారు? అని నిలదీశారు. వాలంటీర్లుగా సేవలందిస్తున్న వాళ్లు పేద ప్రజలని, వాళ్లేమీ డబ్బున్నవారు కాదని వివరించారు. పవన్ కళ్యాణ్‌ను ఆయన అభిమానులు నమ్మొద్దని, ఆయన్ను కేవలం సినిమాల వరకే చూడమని హితవు పలికారు.
Abdul Nazeer: గ్రామీణ వ్యాపార, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో నాబార్డు పాత్ర ఎంతో ముఖ్యమైంది
ఇదిలావుండగా.. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన కార్యక్రమానికి వస్తుండగా.. సీపీఎం కార్యకర్తలు ఒక్కసారిగా షాకిచ్చారు. ఆయన్ను అడ్డుకొని, కోడుమూరు తాగునీటి సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చాలాకాలం నుంచి కోడుమూరులో తాగునీటి సమస్య ఉందని, ఎవ్వరూ దీన్ని పట్టించుకోవడం లేదని, నీళ్ల కోసం ప్రజలు అలమటిస్తున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఆవేదనని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే సుధాకర్ సానుకూలంగా స్పందించారు. తాగునీటి సమస్యని వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అయితే.. ఇలా కార్యక్రమాన్ని అడ్డుకోవడం మంచిది కాదని సూచించారు. పోలీసులు రంగంలోకి దిగి.. సీపీఎం కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సుధాకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Big Breaking: బాబాయ్ కోసం అబ్బాయ్ .. ‘బ్రో’ కోసం రంగంలోకి చరణ్