Kotamreddy Sridhar Reddy: సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. సన్నిహితులతో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని మండిపడ్డ ఆయన.. నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని వైసీపీ అధిష్టానం చెబుతోంది.. ప్రస్తుతం రాష్ట్ర సేవా దళ్ అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్ రెడ్డి.. వైసీపీ తరఫున పోటీ చేస్తే.. తమ్ముడికి పోటీగా నేను నిలబడను అని స్పష్టం చేశారు.. అంతేకాదు, రాజకీయాలకు గుడ్ బై చెబుతా నంటూ సంచలన ప్రకటన చేశారు.. ఫోన్ ట్యాపింగ్ వల్ల నా మనసు కలత చెందిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఈ వ్యవహారం నాకు కునుకు లేకుండా చేస్తోంది. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని స్పష్టం చేశారు.
Read Also: CM YS Jagan Serious: విమానంలో సాంకేతిక సమస్యలు.. సీఎం జగన్ సీరియస్..
మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి విధేయుడిని.. రాజకీయాలు నాకేమీ కొత్త కాదు.. ఎత్తు పల్లాలు ఎరిగిన వాడిని అన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. నా శ్వాస.. ధ్యాస రాజకీయమే.. అన్ని విషయాలు త్వరలోనే మీడియాకు వివరిస్తానని ప్రకటించారు.. అయితే, వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ రాదనే అనుమానంతోనే ఎమ్మెల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం సాగుతోంది.. ఇటీవల సీఎం వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు కోటంరెడ్డి.. ఈ భేటీ వాడివేడీగా జరిగిందట.. నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి… ఆయన అనుచరుల అక్రమాలను సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించినట్లు సమాచారం.. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే సంకేతాలతోనే శ్రీధర్ రెడ్డి ఈ హాట్ వ్యాఖ్యలు చేస్తున్నట్లు పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ లో టీడీపీ నేత నారా లోకేష్ తో సమావేశమైనట్లు కూడా వైసీపీకి తెలిసిందట.. దీంతో, ఆయన కదలికపై నిఘా ఉంచినట్లు సమాచారం.