CM YS Jagan Serious: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. సీఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఢిల్లీ పర్యటన కోసం బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సాయంత్రం 5.03 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది.. అయితే, కొద్దిసేపటికే ఆ విమానంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి.. దీంతో.. సాయంత్రం 5.27 గంటల ప్రాంతంలో తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని దింపేశారు.. దీంతో, సీఎం జగన్ ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే, ఈ ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం వైఎస్ జగన్..
విమానంలో సాంకేతిక సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్.. జీఏడీ, సీఎంవో అధికారులపై సీరియస్ అయిన సీఎం.. ముందుగా విమానం కండీషన్ చూసుకోవాల్సిన బాధ్యత లేదా? అంటూ మండిపడ్డారు.. అయితే, అది రెగ్యులర్‌గా వచ్చే విమానం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి.. మరోవైపు విమానంలో సాంకేతిక సమస్యలపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.. భద్రతా వైఫల్యం, నిర్లక్ష్యం అనే కోణాల్లో విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రీ షెడ్యూల్ చేశారు.. ఇవాళ రాత్రికి 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు.. ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్నారు.. ఇవాళ రాత్రికే ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు.. రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి హస్తినకు వెళ్తారు.. సీఎంతో పాటు విమానంలో సీఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.. రేపు దౌత్యవేత్తలతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ – కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగనుంది.. రేపు ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌కు చేరుకుంటారు సీఎం.. అక్కడ పలు దేశాల దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.. ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది.. సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం జగన్.. రేపు రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి నివాసం చేరుకుంటారు.