MLA Anil Kumar: 2024 ఎన్నికల్లో చంద్రబాబుని ప్రజలు సెంటు భూమిలో కప్పెడతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Anil Kumar Fires On Chandrababu Naidu: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సెంటు భూమి సమాధి కట్టుకోవడానికి పనికొస్తుందని చెప్పిన చంద్రబాబును.. 2024 ఎన్నికల్లో ప్రజలు ఆ సెంటు భూమిలోనే కప్పెడతారని ధ్వజమెత్తారు. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాల కేంద్రం వద్ద వైయస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభించిన అనిల్ కుమార్.. ఈ సందర్భంగానే చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అహంకార ధోరణిని ప్రతి ఒక్కరు అసహ్యించుకుంటున్నారని అన్నారు. పేదలంటే చంద్రబాబుకు చిన్న చూపు, చులకన భావమని.. పేదలకు ఇల్లు ఇస్తుంటే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. పేదల కోసం ఆలోచించిన ఘనత నాడు వైయస్సార్, నేడు జగన్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడానికి జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు.
Allu Arjun: తన మొదటి గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన బన్నీ.. స్నేహ ఏమంటుందో..?
Also Read
అంతకుముందు.. రాజకీయాల్లో ఉన్నంతకాలం తాను జగన్ వెంటే ఉంటానని, జగన్ కోసమే పని చేస్తానని అనిల్ కుమార్ అన్నారు. జగనన్న తనను తరిమేసినా, తిట్టినా, పార్టీలో ఉండొద్దని చెప్పినా.. తాను జగన్ వెంటే ఉంటానే తప్ప పార్టీ మారి, వేరే గుమ్మం తొక్కే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైయస్ జగన్ తనకు ఓ వ్యసనమని, ఆయన కోసం ఏమైనా చేస్తానని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా.. అది జగన్ పెట్టిన భిక్షేనని అన్నారు. తనకు ఏదైనా బాధ కలిగితే.. కచ్చితంగా ఆ విషయం గురించి జగన్‌కి చెప్పుకుంటానని పేర్కొన్నారు. ఒకవేళ తనని పోటీ నుంచి తప్పుకోమని జగన్ చెప్తే.. వెంటనే తప్పుకుంటానన్నారు.
Kriti Kharbanda : శృతి మించిన కృతి.. ఆందాల ఆరబోత కాదు పారబోతే
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!