Seediri Appalaraju: మిస్టర్ మాలోకం మీసం మెలేస్తున్నారు.. చంద్రబాబు తొడలు కొడుతున్నారు అంటూ.. నారా లోకేష్, చంద్రబాబుపై పంచ్‌లు విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు.. అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది, సైకో ప్రభుత్వం నడుస్తుందని మాటాడుతున్నారు బాబు.. పట్టాభిలాంటి ఒళ్లు బలిసిన పంది నోటికొచ్చింది మాటాడితే కార్యకర్తలు తన్నటానికి ప్రయత్నించారని తెలిపారు.. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడినా తన్నటం జరుగుతుందని హెచ్చరించారు.. 40 ఏళ్ల రాజకీయం చెసిన మీరు, కరెంట్ చార్జీలు తగ్గించన్నందుకు కాల్చి చంపేయటం ప్రజాస్వామ్యమా? అని నిలదీశారు.. ఎమ్మెల్యేలను కొని మంత్రి పదవులు కట్టబెట్టడం ప్రజాస్వామ్యమా..? ముద్రగడ పద్మనాభం.. బాబు ఇచ్చిన హామీకోసం, రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తే ఎలా హింసించారో తెలుసని మండిపడ్డారు.. ఎమ్మెల్యేగా ఉన్న రోజాను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు అది ఎలాంటి ప్రజస్వామ్యం? అని మండిపడ్డారు.. ముహూర్తం పెట్టుకొని తేల్చుకుంటాను రమ్మంటున్నాడు చంద్రబాబు.. 23 సీట్లతో మూలనకూర్చో బెట్టారు చూడు అదే బట్టలూడదీయటం అంటే అని ఎద్దేవా చేశారు.. 2024 ఎన్నికల ముహూర్తంలో నువ్వో మేమో తేల్చుకుందాం ? అంటూ సవాల్ విసిరారు అప్పలరాజు.
Read Also: Kalvakuntla Kavitha: మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుంది
లోకేష్ మీసం మెలేసి రారా అంటూ చెబుతుంటే, బాద్ షాలో బ్రహ్మి డైలాగ్‌లా ఉంది.. సీరియస్ సినిమాలో కమిడియన్ రోల్ లా ఉంది… లోకేష్ బాడీలాంగ్వేజ్‌కి చెప్పే డైలాగ్ కి పొంతనలేదని సెటైర్లు వేశారు అప్పలరాజు.. పాదయాత్రలో పిచ్చిచేష్టలు, విచిత్రవేశాలు చెస్తున్నారు… రాజశేఖరరెడ్డి పాదయాత్రను చంద్రబాబు కాపీ చేస్తే.. వైఎస్ జగన్ పాదయాత్రను లోకేష్ అనుకరిస్తున్నారని విమర్శించారు.. నాన్న ఏం చేశాడో లోకేష్ చెప్పలేరు, ఎంత సేపు జగన్‌ను పాలో అవుతున్నారన్న ఆయన.. చంద్రబాబు ఒక్క బూతు తిడితే లోకేష్ వంద తిట్లు తిడుతున్నారని.. తలక్రిందులుగా తపస్సు చేసినా జగన్ ఇమేజ్ ని చెరపలేరని స్పష్టం చేశారు.. రైతు భరోసా, అమ్మ ఒడి పొందుతున్న లబ్దిదారులకు తెలుసు ఎంత అవసరమో జగన్ ప్రభుత్వం.. కానీ, లోకేష్ మూర్ఖుడు, ఆయనకి అర్థం కాదన్నారు. ఇక, చంద్రబాబు అధికారంలోకి రావడం పగటికలగా అభివర్ణించారు.
Read Also: Ritika Singh: యదార్థ సంఘటనల ఆధారంగా ‘ఇన్ కార్’!
నందమూరి కుటుంబం నారా పల్లకీ మోయటానికి ఉపయోగపడుతున్నారు అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు.. చంద్రబాబు ఒక్కరి వలన గెలవలేమని అందరినీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు.. ఎన్టీఆర్ పేరు వినపడకూడదని గతంలో చంద్రబాబు మాట్లాడారు.. ఇప్పుడు లోకేష్ మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని అంటున్నారు అని విమర్శించారు.. అసలు 14 ఏళ్లలో ప్రజలకు ఏం చేసారో ఒక్కటి చెప్పాలని సవాల్ చేసిన సీదిరి.. ఇస్ర్తీ పెట్టెలు , కుట్టుమిషన్లు ఇచ్చి అదరణతో బీసీలకు ఏం చేసావో చెప్పాలి..? ఆధార్ కార్డ్ నెంబర్ తో సహా చేయూత అందిన లక్షలాది మందిని మేం చూపిస్తాం అన్నారు. నాయిబ్రాహ్మణులు, మత్స్యకారులు, ఎస్సీ, ఎస్టీల గూర్చి మాట్లాడిన మీ మాటలు మేం మర్చిపోమన్న ఆయన.. చంద్రబాబు ఒక సైకో.. అలాంటి దుర్మార్గుడుని రాష్ర్టం నుంచి తరిమికొట్టడానికి బీసీ, ఎస్సీ , ఎస్టీలు సిద్ధంగా ఉన్నారు.. రావణాసురుడుతో యుద్ధం అంటున్నారు బాబు.. అసలు అతనే రావణాసురుడు అని వ్యాఖ్యానించారు మంత్రి సీదిరి అప్పలరాజు.