Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతూనే ఉద్యోగుల కష్టాలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. “మీ పాలనలో చిరు ఉద్యోగుల దుస్థితి దారుణంగా తయారైంది. వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు,” అని హరీష్ రావు పేర్కొన్నారు.…
Bopparaju Venkateswarlu: మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చలు ముగిసిన తర్వాత.. ఒక్కో ఉద్యోగ సంఘం స్పందన ఒకోలా ఉంది.. సమావేశంపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తే.. మరికొందరు ఉత్తర్వులు వచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. సచివాలయంలో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. చట్ట బద్దంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు.. రూ. 1800 కోట్ల బకాయిలు ఇంకా ఇవ్వాలన్న ఆయన.. అవి ఎప్పుడు చెల్లిస్తారో తెలియదని…
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు, పెండింగ్ నిధులు వంటి అంశాలపై చర్చించాం.. అన్ని అంశాలకు టైం బాండ్ పెట్టాం.. ఇక, మే ఒకటివ తేదీ నుంచి వరుసగా జీవోలు జారీ అవుతాయని వెల్లడించారు.. పీఆర్సీ కమిటీని ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మంత్రి బొత్ప
ఓవైపు ఉద్యోగుల బదీలీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై హైకోర్టుకు వచ్చిన అప్పీళ్లపై స్పందించింది.కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు వివాదాలపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయుల పిటిషన్లపై విచారించిన హైకోర్టు దీనిపై ఉత్తర్వులు ఇస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఉపాధ్యాయుల అప్పీళ్లను ప్రభుత్వానికి పంపించాలని డీఈఓలకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అప్పీళ్లను సమర్పించిన…
కోవిడ్ తో రాష్ట్ర ఆర్దిక పరిస్దితి దెబ్బతింది అని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కోవిడ్ కారణంగా ముప్పై వేల కొట్లు ప్రభుత్వం పై అధనపు భారం పడింది అని తెలిపారు. ప్రభుత్వానికి కష్టాలు ఉన్నా పేదలకు సంక్షేమం అందించాం. అని చెప్పిన ఆయన పిఆర్సి ఇస్తామన్న మాట డిలే అయ్యింది. కానీ సీఎం జగన్ కృతనిచ్చయంతో ఉన్నారు. ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ ఇచ్చాం. ఒకరిద్దరు మాటలు భూతద్దంలో చుడాల్సిన పనిలేదు. ఉద్యోగులు…
ఉద్యోగులకు చెందిన వివిధ పెండింగ్ సమస్యలపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉద్యోగుల బదిలీ పాలసీపై చర్చ జరిపారు. సీపీఎస్ రద్దు సాధ్య సాధ్యాలపై సమీక్ష చేసారు. సీపీఎస్ రద్దుని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆందోళనలకు ఉద్యోగులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారనే అంశం భేటీలో ప్రస్తావన వచ్చింది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలనే ప్రతిపాదన…