తిరుపతిలో మంత్రి రోజా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు..కోట్ల రూపాయలు డబ్బులో నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నాడు…చంద్రబాబు డబ్బులకు అ నలుగురు అమ్ముడు పోయారు..ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి నానా హంగామా చేస్తూ చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు ..ఎమ్మెల్యే, ఎంపిలను జగన్ తయారు చేసుకున్నారు…గతంలో అమ్ముడుపోయిన 23 మంది పట్టిక గతే అ నలుగురికి పడుతుందన్నారు.
సింహం ఒక అడుగు వెనక్కి అడుగు వేస్తే ఓడిపోయినట్లు కాదు. వచ్చే ఎన్నికలలో 175-175గెలుస్తాం… పులివెందుల చెక్ పోస్టు కూడా తాకలేరు….సస్పెండు అయినా తరువాత అ నలుగురు ఎమ్మెల్యేలు వైసిపికే ఓటు వేశారంటూ డ్రామాలు ఆడుగుతున్నారు…తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారు…డ్రామాలు ఆడి ఎవరని మభ్యపెట్టాలని చూస్తున్నారు. అ నలుగురిలో సీట్లులో కొత్తవారిని నిలపెట్టి జగన్ గెలిపించుకుంటారు అన్నారు మంత్రి రోజా.
Read Also: Papaya Seeds : పండు తిని గింజలని పారేస్తే పొరపాటే
అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ చంద్రబాబుని టార్గెట్ చేశారు. 3300 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్నారు. సిమెన్స్ కంపెనీ పేరుతో ఉపాధి మరియు శిక్షణ పేరుతో గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. షెల్ కంపెనీల ద్వారా 371 కోట్లు దోచుకుంది చంద్రబాబు అండ్ కో.. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన పది శాతం నిధులు నొక్కేశారు చంద్రబాబు..తన బినామీలకు ప్రభుత్వ ఖజానా నుంచి 371 కోట్లు మళ్లించారన్నారు. తన బినామీల కోసం యువత బతుకులను బుగ్గిపాలు చేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.
Read Also: Team India : ఆమిర్ ఖాన్ ను ట్రోల్ చేసిన రోహిత్ సేన