చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వేంకటేష్ గౌడ, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండేళ్లు వైసీపీ ప్లీనరీ జరుపుకోలేకపోయామని..జూలై…
ఏపీలో టీడీపీ నేత నారాయణ అరెస్ట్ అంశం మరో వివాదానికి దారి తీసింది. టెన్త్ ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసుల విచారణ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో నిందితులను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తాము అదుపులోకి తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించడంతో టీడీపీ తీవ్ర అభ్యంతరం చెప్తోంది. ఫోన్ ట్యాపింగ్ నేరమని.. ఈ విషయంలో సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఫోన్…
ఏపీలో కల్తీ మద్యం విక్రయాల వల్ల వైసీపీ నేతలు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగా మారి.. అరాచకాలు, అవినీతి చేశారని మండిపడ్డారు. జే గ్యాంగులో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామి.. ఆయనే జగన్ లావాదేవీలను దగ్గరుండి చూస్తారని విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీలో చిన్నచిన్న డిస్టిలరీను తరిమివేసి వాటిని లీజుకు తీసుకుని జే బ్రాండ్ మద్యం తయారు చేసి సుమారు 350 కోట్ల రూపాయలను…