Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
- ఎమ్మెల్యేలకు కొత్త కార్లు
- రూ.25 లక్షల ఆరోగ్య బీమా
- సీఎం విజయ్ కీలక ప్రకటనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu CM Vijay Announces Big Package: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం పలు కీలక ప్రకటనలు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గ పర్యటనలకు ప్రభుత్వ వాహనాలు, డ్రైవర్ల జీతాలు, వాహన నిర్వహణకు నెలవారీ భత్యం, ఎమ్మెల్యేల కార్యాలయాల్లో సహాయకులను నియమించుకునేందుకు ప్రత్యేక నిధులు, ప్రజలకు ఆరోగ్య బీమా పరిమితి పెంపు వంటి పలు నిర్ణయాలను ప్రకటించారు. ఎమ్మెల్యేలు తరచుగా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సి ఉంటుందని సీఎం విజయ్ తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, స్థానిక సమస్యలను పర్యవేక్షించేందుకు ప్రతి ఎమ్మెల్యేకూ నియోజకవర్గ పర్యటనల కోసం ప్రభుత్వ వాహనం అందించనున్నట్లు ప్రకటించారు. వాహనాలకు డ్రైవర్ల జీతాలు, వాహన సంబంధిత ఖర్చుల కోసం ప్రతి ఎమ్మెల్యేకు నెలకు రూ.75,000 భత్యంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రతి ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యాలయ పనుల కోసం ఒక సహాయకుడిని నియమించుకునేందుకు నెలకు రూ.25,000 అందించనున్నట్లు వెల్లడించారు.
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఆరోగ్య బీమా రూ.25 లక్షలకు పెంపు
తమిళనాడు ప్రజలకు ముఖ్యమైన ఆరోగ్య రంగంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ప్రస్తుతం ఉన్న వార్షిక ఆరోగ్య బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుతో లబ్ధిదారులకు ఖరీదైన వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సల సమయంలో మరింత ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. అదనంగా, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరిన్ని వైద్య, శస్త్రచికిత్స సేవలను అందించనున్నట్లు ప్రకటించారు. చెన్నై, తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగల్పట్టు, తిరువారూర్, కరూర్, కన్యాకుమారి జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
వైద్య విద్యకు రూ.351 కోట్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య, ఆరోగ్య విద్యా సంస్థల్లో అడ్మిషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం రూ.351 కోట్లు కేటాయించింది. దీని ద్వారా వివిధ ఆరోగ్య సంబంధిత కోర్సుల్లో మొత్తం 6,098 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో బీఎస్సీ నర్సింగ్‌లో 660 సీట్లు, నర్సింగ్ కాలేజీలు, పాఠశాలల్లో 1,925 అదనపు సీట్లు, 12 పారామెడికల్, కోర్సుల్లో 2,778 సీట్లు, మెడికల్ కోర్సుల్లో 735 అదనపు సీట్లు ఉండనున్నాయి. అలాగే రాష్ట్రంలో ఏడు కొత్త ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పెరంబలూరులో 400 పడకల ఆసుపత్రి
పెరంబలూరు జిల్లాలో 400 పడకల మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పెరంబలూరు ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందడంతో పాటు రాష్ట్రంలోని ఆరోగ్య మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి.
పాల సేకరణ ధర పెంపు
పాల ఉత్పత్తిదారులకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాల సేకరణ ధరను ప్రస్తుతం ఉన్న లీటరుకు రూ.38 నుంచి రూ.41కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 3.16 లక్షలకు పైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. అదే సమయంలో పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని కూడా లీటరుకు రూ.3 నుంచి రూ.5కు పెంచనున్నారు. పాల సేకరణ ధర పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.30 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడాదికి ఈ వ్యయం సుమారు రూ.360 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రజలు, ఎమ్మెల్యేలకు ప్రయోజనం కల్పించేలా పలు నిర్ణయాలు
ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో మరింత సమర్థంగా పనిచేసేందుకు వాహనాలు, సిబ్బంది సహాయం అందించడంతో పాటు ప్రజలకు ఆరోగ్య బీమా కవరేజీని భారీగా పెంచడం, వైద్య విద్యలో సీట్ల సంఖ్యను పెంచడం, కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, పాల ఉత్పత్తిదారులకు మద్దతు ఇవ్వడం వంటి పలు నిర్ణయాలను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనలతో రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం, వైద్య విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు ఎమ్మెల్యేల నియోజకవర్గ స్థాయి పనితీరుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?