Gudivada Amarnath: పవన్.. వచ్చే ఎన్నికల్లో నీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అసలు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా అని పవన్ కళ్యాణ్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రం కోసం జనసైనికులు ఎదురుచూస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. ఒంటరిగా పోటీ చేసే స్వాతంత్రం లేని పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
Read Also: Dwakra Products: అమెజాన్‌లో ఏపీ డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయాలు
Also Read
2024 ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలలో, 25 ఎంపీ స్థానాలలో నీ పార్టీ పోటీ చేస్తుందా.. దీనికి ముందు సమాధానం చెప్పు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలనతో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని.. ప్రజల సంతోషాన్ని చూడలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడం కోసం పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని.. సీఎం జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..