Gudivada Amarnath: మూడు రాజధానులపై ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నా.. ముందుకు సాగుతూనే ఉన్నారు.. ఇక, విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పై ప్రభుత్వం మరోసారి దూకుడు పెంచింది. ఈ దిశగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో పరిపాలన రాజధాని కార్యకలాపాలు విశాఖపట్నం నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించారు. దీంతో మరోసారి రాజధాని ముహూర్తంపై రాజకీయ ఆసక్తి రేకెత్తిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లును తిరిగి పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి అమర్నాథ్ తాజా వ్యాఖ్యలతో కేపిటల్ దిశగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అమలుకు సిద్ధం అయినట్టే కనిపిస్తోంది. కాగా, ఫిబ్రవరి చివరి వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.. ఇక, మార్చిలో విశాఖ వేదికగా కీలక సదస్సులు జరగబోతున్నాయి.. ఈ సదస్సుల కంటే ముందే.. రాజధానులపై వైఎస్ జగన్ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Ananta Sriram: చిక్కుల్లో సినీగేయ రచయిత అనంత శ్రీరామ్