టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ అనంతశ్రీరామ్ గతంలో ఒక పాట విషయంలో దేవతలను విమర్శించేలా రాసిన వివాదంలో చిక్కుకొని హాట్ టాపిక్ అయ్యాడు. మరోసారి అనంత శ్రీరామ్ వివాదంలో చిక్కుకున్నాడు, ఇటివలే పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అనంత శ్రీరామ్, ఆ సంబరాల్లో మాట్లాడుతూ “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని వాడాడు. రాష్ట్ర ప్రభుత్వం నిషేదించిన ఆ పదాన్ని వాడి అనంత శ్రీరామ్, “భట్రాజుల”ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ భట్రాజు సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిషేధిత పదాన్ని ఉపయోగించిన అనంతశ్రీరామ్ ప్తె చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం జిల్లా ఎస్పీకి భట్రాజు కుల సంఘాలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కూడా అనంత శ్రీరామ్ పై భట్రాజు కుల సంఘాలు ఫిర్యాదు చేస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాయి. కాగా, ఆ పద ప్రయోగంపై అనంత శ్రీరామ్ ఐదు రోజుల కిందటే క్షమాపణలు కోరాడు.
Read Also: Chiranjeevi: మెగా తుఫాన్… మూడోసారి వంద కోట్లు