Gudivada Amarnath: మూడు రాజధానులపై ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నా.. ముందుకు సాగుతూనే ఉన్నారు.. ఇక, విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పై ప్రభుత్వం మరోసారి దూకుడు పెంచింది. ఈ దిశగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో పరిపాలన రాజధాని కార్యకలాపాలు విశాఖపట్నం నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించారు. దీంతో మరోసారి రాజధాని ముహూర్తంపై రాజకీయ ఆసక్తి రేకెత్తిస్తోంది.…
విశాఖను రాజధానిని చేస్తే టీటీడీ అధినేత చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి? తెలంగాణలో బిజినెస్‌లు చేస్తూ హైదరాబాద్‌లో ఉంటాడు.. మాకు విశాఖ రాజధాని వద్దంటారు అంటూ మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో రైతుల భూ సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకురావడంతోనే శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం తీసుకువచ్చామన్నారు.. కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరిగి ప్రజలు…
ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని ప్రచారం జరుగుతోంది.. ముఖ్యమంత్రి వచ్చి విశాఖలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తే ఎవరు అడ్డుకోలేరు.. బీజేపీ మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అంగీకరించబోదని స్పష్టం చేశారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.. ఋషికొండలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత… ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభం కావొచ్చు అని అంచనా వేశారు. ఇక, రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకుల్లో లేవు., మార్కెట్లలోను కనిపించడం లేదు… పెద్ద నోట్లను…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. అధికార పార్టీ నేతలో.. ప్రతిపక్ష నేతలో.. ఈ విషయంపై తరచూ స్పందిస్తూ ఉంటారు.. విశాఖ నుంచి పాలన కొనసాగించాలని అధికార వైసీపీ వేగంగా ప్రయత్నాలు చేసినా.. కొన్ని అనివార్య కారణాలతో అది వాయిదా పడింది.. ఇక, ఈ మధ్య మళ్లీ తరచూ విశాఖ రాజధానిపై మాట్లాడుతూనే అధికార వైసీపీ నేతలు.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ…
రాజధాని తరలింపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అతిత్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించనున్నట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఆర్‌డీఏ కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదు… అతిత్వరలో విశాఖ కు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వ్యాఖ్యానించారు.. ఇక, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించవచ్చు అని తెలిపిన విజయసాయి… రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కొంత కాలం హైదరాబాద్ నుంచి ఆ తర్వాత విజయవాడ…