Atchannaidu: 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో CNG గ్యాస్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పుకొచ్చారు. గత ఐదు సంవత్సరాలు రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నించే అధికారం లేకుండే.. గతంలో ప్రజలను అందరినీ హౌస్ అరెస్టులు చేశారు.. కానీ, ప్రభుత్వం కూటమి ప్రభుత్వ హయంలో అలాంటి పరిస్థితి లేదు.. స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలను సర్కార్ కి చెప్పుకునే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని మంత్రి అచ్చెన్న వెల్లడించారు.
Read Also: Raj Thackeray: ఠాక్రేలను కలపడానికి, బాలాసాహెబ్ చేయలేనిది ఫడ్నవీస్ చేశారు..
ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదు.. ఒక పార్టీకి అధినేత, ఒక నియోజక వర్గానికి ఎమ్మెల్యే మాత్రమే అని మంత్రి అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. మా ప్రభుత్వ హయంలో బెట్టింగులు వేసి ఆత్మహత్య చేసుకునే వారిని, గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటే జగన్ పరమర్శిస్తున్నారు.. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఒప్పుకునేది లేదు.. ఐదు ఏండ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి కారు కింద పడి చనిపోతే.. సాయంత్రం వరకు తీసి ప్రక్కన పడేశారు అని ఆరోపించారు. ఇంతకు జగన్ కు మనసు ఉందా..? మానవత్వం ఉందా.. రాజకీయాలలో ఉండటానికి, రాష్ట్రంలో ఉండటానికి అర్హుడివా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.