Merugu Nagarjuna Fires On Chandrababu Naidu Over Dalit Attacks: చంద్రబాబుకు దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. చంద్రబాబు ఒక దళిత ద్రోహి అని, సీఎంగా ఉన్నప్పుడూ ఏనాడైనా దళితుల్ని పట్టించుకున్నారా? అని నిలదీశారు. దళితులపై దాడులు జరిగితే ఖండించేది, చర్యలు తీసుకునేది ఒక్క సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును అమలు చేస్తే.. మొదటి కేసు చంద్రబాబుపైనే పెట్టాలని చెప్పారు. ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా..? అని తమను అవమానించాడని గుర్తు చేశారు.
Silver Price Hike: 48 గంటల్లో రూ.2300 పెరిగిన వెండి ధర.. కారణాలవే..!
చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని మేరుగు నాగార్జున ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు బూటు కాలితో తన్నితే.. చంద్రబాబు ఎందుకు కేసు పెట్టలేదు? జర్రిపోతులపాలెంలో ఒక దళిత మహిళను వివస్త్రను చేస్తే.. చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తూర్పుగోదావరి జిల్లాలో మాదిగ వ్యక్తిని, ఆవు చర్మాన్ని కోస్తున్నాడని చెట్టుకు కట్టేస్తే.. అప్పుడు అతడ్ని ఆదుకున్నది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ అని గుర్తు చేశారు. చంద్రబాబు సిగ్గు లేకుండా ఎస్సీ సంఘాలతో మీటింగ్ పెట్టాడన్నారు. ఎస్సీలపై తాను చేసిన వ్యాఖ్యలకు గాను.. చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Tomato Prices: భగ్గుమంటోన్న టమాటా ధరలు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. కారణమిదే..
రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని మేరుగు నాగార్జున ఆరోపణలు చేశారు. దళితులు రాజశేఖరరెడ్డి కుటుంబం వెంట ఉన్నారని చంద్రబాబుకు కడుపు మంట అని దుయ్యబట్టారు. బహుశా తమ ప్రభుత్వంలోనూ ఎక్కడో ఒక చోట దాడులు జరిగి ఉండొచ్చని.. కానీ తమ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని అన్నారు. వాటిని ఎందుకు గుర్తు పెట్టుకోవడం లేదని అడిగారు.