Merugu Nagarjuna Comments On Chandrababu Naidu: మేనిఫెస్టోని తూ.చ. తప్పకుండా అమలు చేసిన ఘనత ఒక్క సీఎం జగన్‌ది అని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. జగన్ హయాంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నామని తెలిపారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అయినా.. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత జగన్‌దేనని చెప్పారు. చంద్రబాబులాగా మేనిఫెస్టోని అమలు చేయలేక.. దాన్ని కనపడకుండా చేయలేదని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకున్నారని ఆరోపణలు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే, అన్యాయంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ మోసం చేసిన మనిషి చంద్రబాబు అని దుయ్యబట్టారు.
అంతకుముందు కూడా.. చంద్రబాబు పార్టీ ఇప్పుడు శవ పేటికలా మారిందంటూ మంత్రి నాగార్జున ధ్వజమెత్తారు. పేదలకు జగన్ సెంటు ఇళ్లు, ఇంగ్లీషు విద్య ఇస్తుంటే.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే.. ఒక్క సంక్షేమ పథకం కూడా పెట్టలేదని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. బీసీల తోక కత్తిరిస్తాను అన్నాడని, ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారని చెప్పాడని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు చేసిన చంద్రబాబు.. అందులో ఎన్ని అమలు చేశావో చెప్పాలంటూ నిలదీశారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను స్మశానంతో పోల్చిన నీచుడు చంద్రబాబు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ తొలగించేస్తారని అన్నారు.
26/11 Attack: పాక్ జైల్లో 26/11 దాడి నిందితుడైన హఫీజ్ సయీద్ సన్నిహితుడి మృతి
పేదలకు సెంటు స్థలం ఇస్తుంటే సహించలేని చంద్రబాబు.. పేదలను ధనికులుగా మారుస్తానంటే ఎవరు నమ్ముతారని మంత్రి నాగార్జున విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు కాపీ అని విమర్శించారు. వైసీపీ అమలు చేస్తున్న ‘అమ్మకు ఒడి’ పథకాన్ని ‘అమ్మకు వందనం’ పేరుతో కాపీ కొట్టారని తూర్పారపట్టారు. తన 75 ఏళ్ల జీవితంలో చంద్రబాబుకు పూర్ టు రిచ్ అనే కార్యక్రమం ఇప్పుడే గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. సరికొత్త వాగ్దానాలు చేయడం, నాటకాలు ఆడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏనాడూ తాను ప్రకటించిన మేనిఫెస్టోని అమలు చేయలేదని విమర్శించారు.